బాబు సర్కార్ కి గండం..వైసీపీ లోఆశలు రేపిన జోస్యం?

Spread the love

Posted [relativedate]

venu swamy predictions about on tdp party ysrcp happy about that
ఏపీ లో క్యాబినెట్ విస్తరణ తర్వాత రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ఒకప్పుడు క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే టీడీపీ లో అసంతృప్త స్వరాలు పెద్ద ఎత్తున వినిపించాయి.పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మంత్రి పదవులు తన్నుకుపోతుంటే పాత కాపులకి గుండె రగిలిపోయింది.కొందరు బయట పడ్డారు.ఇంకొందరు ఆ మంటలు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా టీడీపీ లో అసంతృప్తి వ్యక్తమైంది.దీనంతటికీ క్యాబినెట్ విస్తరణ కారణమని అందరూ అనుకుంటుంటే..ఓ జ్యోతిష్కుడు మాత్రం తాను ఈ విషయం ముందే చెప్పనంటున్నాడు.లోకేష్ మంత్రి వర్గంలోకి చేరింది మొదలు టీడీపీ లో లొల్లి మొదలవుతుందని,అది తీవ్ర స్థాయికి చేరుకుంటుందని,లోకేష్ చర్యల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదని వేణుస్వామి అనే జ్యోతిష్కుడు చెప్పాడు.అయితే దాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.

తాజాగా టీడీపీలో అసమ్మతి చూసాక ఆ జ్యోతిష్కుడి మాటల్లో నిజముండేమోనని వైసీపీ లో కొత్త ఆశలు రేగాయట. ఆ పార్టీ అంచనా ప్రకారం టీడీపీ లో 40 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి తో ఉన్నారట …వారంతా రాజీనామాలు చేస్తే టీడీపీ సర్కార్ కి గండం తప్పదట.ఇదే విషయాన్ని వైసీపీ అనుకూల సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాపింపజేస్తున్నారు.ఏదేమైనా ఆశ ఎక్కువైతే వాస్తవాల కన్నా నమ్మకాలు మనిషిని ముందుకు నడిపిస్తాయేమో.ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలాగే వుంది.ఓ జోస్యాన్ని పట్టుకుని అధికారం కోసం ఈదేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here