కిడ్నాప్-మర్డర్ కేసులో హీరోయిన్….

0
532
vidya balan on kidnap murder case

 Posted [relativedate]

vidya balan on kidnap murder case

కిడ్నాప్-మర్డర్ కేసుల్లో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఇరుక్కొంది. పరారీలో ఉన్న ఆమె ఆచూకి తెలిస్తే.. వెంటనే పోలీసులకి తెలియజేయాలంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పోస్టర్ ని విద్యాబాలన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం మరో విశేషం.

అయితే, విద్యాబాలన్ మర్డర్ కేసులో ఇరుక్కొంది రియల్ లైఫ్ లో కాదులెండీ. రిలీ లైఫ్ లో. ఆమె నటిస్తోన్న తాజా చిత్రం కహాని-2. 2012లో వచ్చిన ‘కహాని’ చిత్రానికి రిమేక్ ఇది. సుజయ్ ఘోష్ దర్శకుడు. ఓ గర్భిణి  తన భర్త ఆచూకీని తెలుసుకునేందుకు ఎన్ని పాట్లు పడిందో.. ఎన్ని ప్రాంతాలు తిరిగిందో చక్కగా చూపించాడు   దర్శకుడు సుజయ్. ఇక, సీక్వెల్ లో ఫస్ట్ లుక్ తోనే విద్యాబాలన్ క్రిమినల్ గా చూపించాడు.

ఇందులో విద్యా దుర్గా రాణీ సింగ్ పాత్ర పోషిస్తోంది. తాజగా రిలీజైన ఫస్ట్ లుక్ కహాని సీక్వెల్ పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. చూస్తుంటే.. కహాని రిజల్ట్ రిపీట్ అవుతుందేమో అనిపిస్తోంది. ఏమో.. చూడాలి మరి.

Leave a Reply