నెట్ లో భేతాళుడు 10 నిమిషాల క్లిప్

Posted [relativedate]

vijay antony bethaludu movie leaked in online

భేతాళుడు తమిళ వర్షన్‌కు సంబంధించిన సైతాన్ … మొదటి పది నిమిషాల ఓపెనింగ్ సీక్వెన్స్‌‌ను విజయ్ ఆంటోనీ యూట్యూబ్‌లో విడుదల చేశారు. జయలక్ష్మిని అన్వేషిస్తూ… వచ్చే ఈ ఓపెనింగ్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను పతాక స్దాయికి తీసుకెళ్ళేలానే ఉంది. ఆ క్లిప్ ని నెట్ లో చూడొచ్చు .

ఈ సన్నివేశాలను చూసిన ప్రతి ఒక్కరికీ.. ‘ఎవరు ఆ జయలక్ష్మి?’ అనే ప్రశ్న తలెత్తుతోంది.ఆ ప్రశ్నకు డిసెంబర్ 2 న సమాధానం లభిస్తుందని చెబుతున్నారు ఆరా సినిమాస్‌ అధినేత మహేష్‌ గోవిందరాజ్‌. దర్శకుడిగా తన తొలి చిత్రమిదని, సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించామని, జయలక్ష్మి అనే మహిళ కోసం ఓ యువకుడు సాగించిన అన్వేషణ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని దర్శకుడు పేర్కొన్నారు.

బిచ్చగాడు సినిమా రీమేక్ హక్కులు తీసుకోవడానికి తెలుగులో చాలా మంది నిర్మాతలు ముందుకువచ్చారని, కానీ విజయ్ ఆంటోని మాత్రం అనువాద రూపంలో విడుదల చేయాలని నిర్ణయించారని, అదే అతడికి మంచి పేరును తీసుకొచ్చిందని ఫాతిమా విజయ్ ఆంటోని అన్నారు. విజయ్ ఆంటోని, అరుంధతి నాయర్ జంటగా నటించిన తమిళ చిత్రం సైతాన్. ఈ సినిమాను భేతాళుడు పేరుతో నిర్మాతలు కె.రోహిత్, ఎస్. వేణుగోపాల్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. మల్కాపురం శివకుమార్ సమర్పకుడు.

[wpdevart_youtube]z2duX-_YVeE[/wpdevart_youtube]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here