Posted [relativedate]
బిచ్చగాడు.. ఈ తెలుగు డబ్బింగ్ సినిమా టాలీవుడ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఏ మాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమా రేంజ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో అటు తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకోగలిగాడు విజయ్ ఆంటోని. సంగీత దర్శకుడిగా కూడా మంచి పేరు సాధించిన విజయ్ ఇటీవల యమన్ అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటించాడు. రజనీకాంత్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు అంటే.. ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇలా వరుస హిట్ల తో విజయ్ దూసుకుపోతున్నాడు. దీంతో అతను చేయబోయే నెక్ట్స్ సినిమా గురించి ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి తగినట్లుగానే విజయ్ ఆంటోని అన్నాదురై అనే బైలింగ్యువల్ సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని సమాచారం. డిఫరెంట్ కధలతో వైవిధ్య నటనను ప్రదర్శించే విజయ్ ఈ సినిమాతో ఎలా అలరిస్తాడో చూడాలి.