నిర్మాతగా త్రివిక్రమ్.. సినిమాపై ఫుల్ క్రేజ్

Posted October 8, 2016

    vijay devarakonda director nandini reddy movie trivikram  producer

రచయితలు.. దర్శకులుగా, దర్శకులు.. నిర్మాతలుగా మారడం టాలీవుడ్ లో సహజమే. టాలీవుడ్ లో ఇప్పుడున్న టాప్ దర్శకులంతా రచయిత నుంచి దర్శకులుగా ప్రమోటైన వారే. వారిలో కొందరు నిర్మాతలుగా కూడా మారారు. ఇప్పటికే సుకుమార్, పూరీ జగన్నాథ్.. లాంటి దర్శకులు సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడీ ఈ లిస్టులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా చేరిపోయారు.

మహిళా దర్శకులు నందిని రెడ్డి దర్శకత్వంలో ‘పెళ్లి చూపులు’ ఫేం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న చిత్రాన్ని త్రివిక్రమ్ నిర్మించనున్నాడు. ఇంతకీ త్రివిక్రమ్ నిర్మాతగా మారాలనే థాట్ ఎలా వచ్చింది.. ? అది కూడా నందిని రెడ్డి సినిమానే ఎందుకు ఎంచుకొన్నాడు.. ?? అంటే.. ముందుగా ఈ కథని
నిర్మాత రాథాకృష్ణ కి వినిపించేందుకు నందిని రెడ్డి వచ్చిందట. ఆ సమయంలో అక్కడే ఉన్న త్రివిక్రమ్ కి ఈ కథ బాగా నచ్చేసింది. అందుకే.. నిర్మాతగా
మారేందుకు రెడీ అయ్యాడు.

ఇదిలావుండగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ‘దేవుడే దిగొచ్చినా’ టైటిలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ పవర్ ఫుల్ కథని రెడీ చేశాడట త్రివిక్రమ్. మొత్తానికి.. పవన్ సినిమాని డైరెక్ట్ చేస్తూనే.. నందిని రెడ్డి సినిమాని నిర్మించనున్నాడు త్రివిక్రమ్. మరి.. నిర్మాతగా కూడా త్రివిక్రమ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

SHARE