ఆ కుర్ర హీరో కి భారీ ఛాన్సులు..

Posted September 29, 2016

  vijay devarakonda got many big movie chances
వారసులకు మాత్రమే అవకాశాలు అనే ట్రెండ్ కి టాలీవుడ్ లో ఇక కొనసాగకపోవచ్చనడానికి ఆ కుర్ర హీరో కెరీర్ నిలువెత్తు సాక్ష్యంగా వుండబోతోంది.పెళ్లిచూపులు హిట్ తో టాప్ బ్యానర్స్ కళ్ళు విజయ్ దేవరకొండ మీద పడ్డాయి.అంతకు ముందు ఎవడే సుబ్రమణ్యం సినిమా లో కూడా అతను మంచి పాత్ర పోషించాడు.బాగా చేశాడన్న పేరు వచ్చినా పెళ్లిచూపులు హిట్ తర్వాత ఫేట్ మారిపోయింది.యువీ క్రియేషన్స్,వైజయంతి మూవీస్ వంటి భారీ నిర్మాణ సంస్థలు అతనితో సినిమా ప్లాన్ చేస్తున్నాయి.

ఇప్పటికే ద్వారక,అర్జున్ రెడ్డి అనే రెండు సినిమాలు చేస్తున్న విజయ్ భారీ బ్యానర్లలో అవకాశాలు రావడంపై హ్యాపీ గా వున్నాడు.అయితే కథ కి మాత్రమే తొలి ప్రాధాన్యమివ్వాలని విజయ్ భావిస్తున్నాడు.యువీ లో విజయ్ చేసే సినిమాకి దర్శకుడు మారుతి కూడా ఓ నిర్మాతగా ఉంటారట.అయన శిష్యుడు రాహుల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించావుతున్నారు.బ్యాక్ గ్రౌండ్ లేకున్నా సినిమా రంగం లో రాణించవచ్చని నిరూపించిన విజయ్ దేవరకొండ కి అల్ ది బెస్ట్ ..

SHARE