పెళ్లి చూపులు హీరో టైం మామూలుగా లేదుగా!!

Posted [relativedate]

vijay devarakonda got many movie offersవిజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. పెళ్లి చూపులు సినిమాకి  ముందు ఛాన్స్ ల కోసం తిరిగిన ఈ హీరో టైం ఇప్పుడు మామూలుగా లేదు. ఒకప్పుడు వేషం కోషం ఇతను దర్శకుల చుట్టూ తిరిగితే ఇప్పుడు సదరు దర్శకులు దేవరకొండ చుట్టూ డేట్స్ ఇవ్వమని తిరుగుతున్నారు.

పెళ్లి చూపులు చిత్రం తరువాత ఈ హీరో  దాదాపు 6 చిత్రాలకు సైన్ చేసాడు. ఆ 6 చిత్రాలలో ద్వారకా సినిమా ఎల్లుండి విడుదలవుతుండగా , అర్జున్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా త్వరలో రిలీజ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం దేవరకొండ… దేవా కట్ట దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రానికి కూడా సైన్ చేశాడని తెలుస్తోంది. అయితే ఈ హీరో ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ లో  బిజీగా ఉన్నాడు. దీంతో దేవాకట్ట సినిమాని వచ్చే  సంవత్సరం పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. దేవా కట్ట కూడా  ప్రస్థానం హిందీ రీమేక్ చిత్ర షూటింగ్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ తాజా సినిమా పనులను ప్రారంభించే యోచనలో ఉన్నాడట.

కాగా ఒకప్పుడు రవితేజ కూడా వేషాల కోసం చాలా తపన పడ్డాడు. అయితే పూరీ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్యణ్యం సినిమా తర్వాత అతని ఫేట్ మారిపోయి మాస్ మహారాజా స్థాయికి ఎదిగాడు. మరి విజయ్ దేవరకొండ కూడా అంతటి ఫేమ్ ని సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here