ఇచ్చినోడు ఈగ…పుచ్చుకున్నోడు పులి

0
583

Posted [relativedate]

vijay mallya arrested in london and gets bail
” ఇచ్చినోడు ఈగ ..పుచ్చుకున్నోడు పులి” అని అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళ గురించి ఓ నానుడి వుంది.ఇప్పుడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విషయంలో అది మరోసారి రుజువైంది.ఇండియా కాబట్టి అప్పు ఎగ్గొట్టి పోయాడు అని చాలా మంది ఇప్పటిదాకా అనే వాళ్ళు.అయితే డబ్బుంటే ఇండియా అయినా యూకే అయినా ఒక్కటే అని తేల్చేసాడు మాల్యా.ఇక్కడ బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి హాయిగా లండన్ లో కాలక్షేపం చేస్తున్న మాల్యాని అప్పగించాలని భారత్ తెచ్చిన ఒత్తిడితో ఆ దేశ పోలీస్ విభాగం కదిలింది.లండన్ లోని స్టాట్ ల్యాండ్ యార్డ్ పోలీసులు మాల్యాని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో హాజరుపరిచారు.ఆయనకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అయితే కొన్ని షరతులు మాత్రం పెట్టింది.అరెస్ట్ అయిన మూడంటే మూడు గంటల్లో మాల్యా మహాదర్జాగా విడుదల అయ్యారు.

17 బ్యాంకుల కన్సార్టియం కి విజయ్ మాల్యా దాదాపు 9 వేల కోట్లు అప్పు ఎగవేశారు.ఆ తర్వాత మూటాముల్లె సర్దుకుని లండన్ చెక్కేశారు.ఇప్పుడు కూడా మీడియా అంతా మాల్యా అరెస్ట్,విడుదల మీద హడావిడి చేస్తుంటే ఆయన మాత్రం ఇదేదో చిన్న విషయం అన్నట్టు కొట్టిపారేస్తున్నారు.నిజమేగా మరి …9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలు పారిపోయినవాడికి ఇది చిన్న విషయమే.అందుకే అన్నారు పెద్దలు ఇచ్చినోడు దాన్ని ఎలాగైనా వసూలు చేసుకోడానికి ఈగలా వాలుతుంటాడు.తీసుకున్నోడు ఎదో ఒక గొడవతో అప్పు ఎగ్గొట్టడానికి పులిలా గాండ్రిస్తాడు.

Leave a Reply