మాల్యా చుట్టు ఉచ్చుబిగిస్తోందా..?

0
296

vijay malya trapped

ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ విజయ్ మాల్యా కు మరోసారి షాక్ ఇచ్చింది. ఐడీబీఐ రుణ అవకతవకల కేసులో సీరియస్ గా స్పందించిన ఈడీ మరో కేసులో విచారణను వేగవంతం చేసింది. యునైటెడ్ స్పిరిట్స్ దాఖలు చేసిన దాదాపు 9వందల కోట్ల రూపాయల ఫారిన్ ఎక్సేంజ్ నిబంధనల అతిక్రమణ ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ మారక నిబంధనల ఉల్లంఘన కోణంలో దర్యాప్తు మొదలు పెట్టినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. యూఎస్ ఎల్ సమర్పించిన పత్రాలపై మనీలాండరింగ్ , కేసులో ప్రత్యేక ఆర్థిక విచారణ ఏజెన్సీ ఆధర్యంలో విచారణ జరగనుందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.

దాదాపు 9 వేల కోట్ల రుణాలు ఎగవేసి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాపై ఈడీ విచారిస్తున్న ఇది రెండవ కేసు కాగా రుణాల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి మొదటిది.యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ మాజీ ఛైర్మన్ విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా రూ 900 కోట్ల మేరకు విదేశీ మారక ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన ధిక్కారం పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.

కాగా అక్రమ లావాదేవీల ఆరోపణలతో మాల్యా వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతి పెద్ద లిక్కర్ సంస్థ డియాజియో ఫిర్యాదుల అనంతరం, మరో కేసులో విచారణ వేగవంతం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐడీబీఐ మనీలాండరింగ్ కేసులో మాల్యాకు చెందిన రూ.1411 ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. ఈ ఏడాది మార్చి 13న మాల్యా ఉద్దేశ పూర్వంగా రుణాలను ఎగ్గొట్టినట్టు ముంబై కోర్టు తేల్చి చెప్పింది. అలాగే చెక్ బౌన్స్ కేసులోఏఏఐ దాఖలు చేసిన పిటిషన్ పై దర్యాప్తుకు హాజరు కాని మాల్యాపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply