శశికళని చూసి ఆ వైసీపీ ఎంపీ వెన్నులో చలి..

0
545
vijay sai reddy fear because of sasikala present position

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

vijay sai reddy fear because of sasikala present position
రాచపీనుగ ఒంటరిగా స్మశానానికి పోదని ఓ నానుడి.రాజరికం నాటి ఆ మాట ఎంత నిజమో..అవినీతి రాజకీయనేతలు ఒంటరిగా జైలుకి పోరన్నది అంతే నిజం. ఇప్పుడు ఈ విధయానికి నిలువెత్తు సాక్ష్యమే శశికళ జీవితం.జయ జీవితంలో విడదీయలేని బంధం పెనవేసుకున్న ఆమె ఇప్పుడు ఎలాంటి క్షోభ అనుభవిస్తుందో చూస్తూనే వున్నాం.జయ బతికివుంటే జైల్లో వున్నా ఆమెతో పాటు సకల సౌకర్యాలు శశి దగ్గరికి నడిచివచ్చేవేమో.కానీ ప్రస్తుతం సీన్ తల్లకిందులైంది. శశికి ఒంటరితనం తోడైంది.ఈ పరిస్థితి చూసి తమిళనాట ఎందరు ఏమనుకుంటున్నారో గానీ వైసీపీ కి చెందిన ఓ ఎంపీ మాత్రం వెన్నులో చలితో వణికిపోతున్నాడు.ఆయనే జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి.

ఆర్ధిక నేరాల కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ అధినేత జగన్ ఏ 1 ,దానికి సంబందించిన కేసుల్లో ఏ 2 విజయసాయిరెడ్డి కూడా వున్నారు.ఆ కేసుల్లో తీర్పు సంగతి అటుంచితే జగన్ నీడ నుంచి బయటకు వస్తే ఏ పరిస్థితులు ఎదురవుతాయో అన్న ఆలోచన చేయడానికి కూడా విజయసాయి భయపడేట్టు చేసిందట శశికళ జీవితం.చదువుకున్నవాడు,తెలివైనవాడు,ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన విజయసాయి ఈ పరిణామాల్ని ముందుగానే ఊహించి అప్పట్లో కాంగ్రెస్ తరపున కొందరు అప్రూవర్ గా మారమన్నా ఒప్పుకోలేదు.ఆ తెలివితేటలు తనను ఎంపీ ని చేసినందుకు సంతోషంగా అనిపించినా శశికళ ప్రస్తావన వస్తే మాత్రం తెలియని భయం ఆయన్ని వెన్నాడుతోందట. ఏమి చేస్తాం …చేసుకున్నోళ్లకి చేసుకున్నంత.

Leave a Reply