ఉద్యోగం కావాలా నాయనా : పేటీఎం

139

Posted [relativedate]

vijay shekhar tweet about paytm job offersప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ ఇటీవల తమ సంస్థలో పనిచేసే 600 మంది ఉద్యోగులను  ఊడబీకి పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్నాప్ డీల్ కొంతమందికి మాత్రమే ఎసరు పెడితే స్టేజిల్లా మొత్తానికే తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. అటువంటి వారికి తీపికబురును అందించింది పేటీఎం. ఉద్యోగం కావాలా నాయనా… అంటూ  కొత్త కొలువుల జాతరను  ఏర్పాటు చేసింది.

శుక్రవారం ఉదయం పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు.” హలో ఢిల్లీ, జాతీయ రాజధాని పరిశ్రమలోని టెక్, ప్రొడక్ట్ ఉద్యోగులారా, వ్యాపార పునరుద్ధరణతో చాలా అసంతృప్తితో ఉన్నారా? అయితే పేటీఎం, పేటీఎం మాల్ మీకు వెల్ కమ్ చెబుతోంది” అంటూ ఓ ట్వీట్ చేశారు.

కాగా పేటీఎం తన ఈ కామర్స్ వ్యాపారాలను మరింత విస్తరించనుందని, అందులో భాగంగానే  ఉద్యోగాల ప్రకటన ఇచ్చామని కంపెనీ అధికార ప్రతినిధి వివరించారు. తమ మార్కెట్ ప్లేస్, బ్యాంకులో కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నామని వెల్లడించిన ఆయన  ట్రైన్డ్, డొమైన్ ఎక్స్ పర్ట్ లకు స్వాగతం పలికారు. లింక్డ్ ఇన్ పోస్టుల ద్వారా కూడా ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పేటీఎం ఉద్యోగ సదుపాయం కల్పిస్తోందని తెలిపారు. ఆయా కంపెనీల వల్ల రోడ్డున పడ్డ వారంతా పేటీఎం ఉద్యోగ ప్రకటనతో  తెగ సంబరపడిపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here