Posted [relativedate]
నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు వంటి సూపర్ హిట్ మూవీస్ కి దర్శకత్వం వహించిన కె. విజయ భాస్కర్ గుర్తున్నాడు కదూ. అయితే ఈ సినిమాలు అంతటి విజయాన్ని సాధించడానికి మూల కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన మాటలు అని ఘంటాపదంగా చెప్పచ్చు. ఈ మూడు సినిమాలే కాక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్నీ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే దర్శకుడిగా మారిన త్రివిక్రమ్… విజయభాస్కర్ సినిమాలకు మాటలు అందిచడం మానేశాడు. కేవలం తన సినిమాలకు మాత్రమే మాటలను రాసుకుంటూ అత్తారింటికి దారేది వంటి సెన్సేషన్ హిట్స్ ని అందిస్తున్నాడు. కాగా త్రివిక్రమ్ తప్పుకున్న తర్వాత విజయభాస్కర్ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. గత కొంతకాలంగా విజయ్ భాస్కర్ పేరు పెద్దగా వినిపించడం లేదు. తాజాగా ఆయన మళ్లీ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా విజయ్ భాస్కర్ ఓ సినిమా తెరకెక్కించనున్నాడని సమాచారం. నువ్వే కావాలి సినిమా మాదిరిగా ఫ్రెండ్ షిప్, లవ్ బేస్ చేసుకొని ఈ కథని తయారు చేశాడట. ఈ సినిమాతో ఓ కొత్త రచయితని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని, కొత్త సినిమా స్క్రిప్టు చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. అతను కూడా త్రివిక్రమ్‌లా పేరు తెచ్చుకొంటాడన్న టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ రచయిత మరో మాటల మాత్రింకుడవుతాడేమో చూడాలి.