అమ్మ ఆరోగ్యంపై కెప్టెన్ రియాక్షన్ ఇదే..

Posted October 15, 2016

  vijayakanth comment on jayalalitha health
అమ్మ ఆరోగ్యం గురించి అన్నాడీఎంకే వర్గాలు చేస్తున్న ప్రచారం ప్రజల్లో అయోమయం సృష్టిస్తోందంటూ డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయకాంత్ అంటున్నారు.రోజుకో నాయకుడు ప్రకటన చేయడం మానేసి ప్రభుత్వం తరపున పూర్తి వివరాలు వెల్లడించాలని అయన డిమాండ్ చేశారు.పన్నీర్ సెల్వం కి బాధ్యతల అప్పగింత జయ అనుమతితో జరిగిందో లేదోనని కెప్టెన్ డౌట్ వ్యక్తపరిచారు.పీఎంకే అధ్యక్షుడు రాందాస్ సైతం ఇదే అభిప్రాయం తో వున్నారు .దీంతో ఈ ఇద్దరిపై అన్నాడీఎంకే వర్గాలు మండిపడుతున్నాయి.

మరోవైపు కరుణ సతీమణి ఆస్పత్రికి వచ్చి జయ ఆరోగ్యం గురించి శశికళతో మాట్లాడ్డం గురించే తమిళనాడంతా చర్చ సాగుతోంది.రాజకీయ బద్ధ వైరం ఉన్నప్పటికీ కరుణ కుటుంబం పరామర్శకు రావడం తమిళనాడు పరిస్థితులు తెలిసినవాళ్లదందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

SHARE