ఉయ్యాలవాడలో రాములమ్మ.. నిజమెంత?

137
Spread the love

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

vijayasanthi laying role in cheeranjeevi 151 movie
మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాతో గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం చిరంజీవి 151వ సినిమా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవి 151వ సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. ఈ సమయంలోనే ఈ సినిమాలో లేడీ అమితాబచ్చన్‌గా పేరు తెచ్చుకున్న రాములమ్మ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఎన్నో మంచి చిత్రాల్లో, హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించిన రాములమ్మ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం ఒక మంచి పాత్రను ఆమె ఎంపిక చేసుకునేందుకు సమయం తీసుకుంటుంది. ఈ సమయంలోనే ఉయ్యాలవాడలో ఈమె నటించనుందంటూ వస్తున్న వార్తలు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి సినిమాలో విజయశాంతి నటించే ఛాన్స్‌ లేదని, వారిద్దరి మద్య ఉన్న వైరం కారణంగా వారు ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నటించే ఛాన్స్‌ లేదని అంటున్నారు. ఇవన్ని కొందరు ఔత్సాహికులు పుట్టిస్తున్న పుకార్లే కాని, ఉయ్యాలవాడలో అస్సలు విజయశాంతిని కనీసం అనుకోను కూడా అనుకునే పరిస్థితి లేదు. మెగా ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఇలాంటి గందరగోళ పుకార్లను నమ్మవద్దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here