Posted [relativedate]
కాలచక్రం తిరుగుతోందన్న స్పృహ కోల్పోతే ఏమవుతుందో లేడీ అమితాబ్ విజయశాంతి విషయంలో మరోసారి రుజువైంది.ఒకప్పుడు దక్షిణాదిలోనే కాదు యావత్ భారతంలో కర్తవ్యం సినిమాతో ఓ వెలుగు వెలిగిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.బీజేపీ,తల్లి తెలంగాణ,తెరాస ,కాంగ్రెస్ ఇలా పార్టీలు మారుతూ పోయారు.రాజకీయంగా తనకు దక్కిన,దక్కుతున్న ప్రాధాన్యాన్ని చూసుకుని తనను తాను ఎక్కువ అంచనా వేసుకుని బొక్కబోర్లా పడ్డారు.ఓ విధంగా చెప్పాలంటే కళ్ల ముందు కోరుకున్న తెలంగాణ సాక్షాత్కరించినా ఆమె మాత్రం అందులో కనీస పాత్ర పోషించే పరిస్థితి లేదు.ఈ పరిస్థితిని మార్చడానికి పోయిన చోటే వెదుక్కోవడం మానేసి ఎక్కడో తమిళనాడు వెళ్లి ఇప్పుడు అక్కడా పరువు పోగొట్టుకుని వచ్చారు.
ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో దినకరన్ కి అండగా ప్రచారం చేశారు విజయశాంతి.ఇప్పుడేమో ఆ ఎన్నికలు ఆగిపోయాయి.ఆమె నెత్తికెత్తుకున్న శశికళ,దినకరన్ ని అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు . ఈ పరిణామాలతో విజయశాంతి పరువు అక్కడా హుష్ కాకి అయింది.కాలం తో పాటు వచ్చే మార్పుల్ని గుర్తించకుండా తమని తాము ఎక్కడో ఊహించుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.