మెగా మోతకు అడ్డాగా మారనున్న విజయవాడ..!

 Posted November 3, 2016

mgf1

మెగాస్టార్ ఎంట్రీతో మంచి జోష్ లో మెగా హీరోలంతా ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ మరింత బిజీగా ఉన్నాడు. ఓ పక్క చిరు సినిమా నిర్మాతగా ఉంటూనే మరో పక్క తన సినిమా షూట్లో పాల్గొంటూ కష్టపడుతున్నాడు రాం చరణ్. ప్రస్తుతం చెర్రి నటిస్తున్న ధ్రువ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అంచనాలను ఏర్పరచుకుంది. అయితే ఈ అంచనాలను మరింత పెంచేలా ఆడియో ఏర్పాటు చేసి మెగా ఢంకా మోగిస్తారేమో అనుకుంటే ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోనే రిలీజ్ చేస్తారని అంటున్నారు.

ఆడియో రిలీజ్ అంత సింపుల్ గా ఎందుకు అంటే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేసే ఉద్దేశంతో ఆడియోని అలా డైరెక్ట్ గా మార్కెట్ లో వదులుతారట. ఈ నెల 9 నుండి ధ్రువ సాంగ్స్ మార్కెట్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందు మాత్రం విజయవాడలో మెగా మోత మోగించేందుకు సిద్ధం అవుతున్నారట. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ తో పాటుగా మిగతా మెగా హీరోలంతా పాల్గొంటారని తెలుస్తుంది. అసలైతే ధ్రువ ఆడియోకి పవర్ స్టార్ ను గెస్ట్ గా పిలిచి ట్రెండ్ క్రియేట్ చేద్దామనుకోగా మధ్యలో ఏమైందో ఏమో కాని ఇప్పుడు ఆడియో సింపుల్ గా కానిచ్చి ప్రి రిలీజ్ ఫంక్షన్ మాత్రం గ్రాండ్ గా చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి విజయవాడలో జరుగనున్న ఈ మెగా ఉత్సవం ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి.

SHARE