విజయవాడ బెజవాడ అవుతుందా.?

 vijayawada name changed bezawadaఏపీ కేబినెట్ లో విజయవాడ పేరు మార్పుపై చర్చ జరిగే అవకాశం ఉంది. గోదావరి పుష్కరాల తరువాత రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పేరు మార్చుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పుష్కరాలు కొనసాగుతున్న సమయంలోనే జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి పేరు మార్పును రాష్ట్ర ప్రజలు ఆమోదించారు.

తాజాగా విజయవాడ పేరును బెజవాడగా మార్చాలని పలువురు ప్రతిపాదిస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. అందువలన ఈ అంశాన్ని శనివారం జరగనున్న కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.టూరిజం ప్రాజెక్ట్‌లపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయడానికి వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి.

కృష్ణా పుష్కరాల సందర్భంగా వివిధ విజయవాడ, చుట్టుపక్కల ప్రదేశాల్లో భారీ టూరిజం ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసే అవకాశాలను ప్రభుత్వం గుర్తించింది. అందువలన ఈ అంశాన్ని కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలింపు, సెక్రటేరియట్ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు తీసుకోవలసిన చర్చల గురించి చర్చించే అవకాశం ఉంది. పుష్కరాలు విజయవంతం కావడంతో సిఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

SHARE