బెజవాడలో పుష్కర ఏర్పాట్లు పూర్తి..

0
499

 vijayawada pushkaralu works finished

కృష్ణా పుష్కరాలకు ఏపీ సర్కార్ భారీ ఏర్పట్లు చేసింది. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు, యాత్రికులు ప్రశాంత వాతావరణంలో పవిత్ర కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి వారివారి గమ్యస్థానాలకు క్షేమంగా వెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ మేరకు అన్ని మౌలిక సదుపాయా లతో కూడిన పుష్కరనగర్ల నిర్మాణ పనులు సాగు తున్నాయి..

ప్రభుత్వం పుష్కరాలను ప్రతి ష్ఠాత్మకంగా స్వీక రించింది. పుష్క రాల ప్రారంభానికి ఇంకా గంటల సమయమే ఉన్నప్పటికీ పుష్కరనగర్ల ఏర్పాటు పనులు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు, యాత్రికులు విజయవాడ చేరుకుంటారని భావిస్తున్న అధికారులు వారికి తగిన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ నగరం లోపల 10, వెలుపల మరో 8 పుష్కరనగర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పుష్కర స్నానఘాట్లకు దగ్గర్లో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.

pushkar Ghat

పుష్కర నగర్ లు ఇవే
విజయవాడ నగరం లోపల ఏర్పాటు చేస్తున్న పుష్కరనగర్ల కోసం ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేయగా, నగరం వెలుపల ఏర్పాటు చేస్తున్న పుష్కరనగర్ల కోసం రూ.2 కోట్లు మంజూరు చేసింది. విజయవాడ నగరం లోపల పుష్కరనగర్లు ఏర్పాటు చేశారు. 6.55 ఎకరాల విస్తీర్ణం, ఘాట్లకు 3.50 కిలోమీటర్ల దూరం గా భవానీపురం మీనా మార్బుల్ ప్రాంగణం, విస్తీర్ణం 8.50 ఎకరాలు, ఘాట్లకు 2.50 కిలోమీటర్ల దూరంగా భవానీపురం ఎట్కిన్‌సన్ పాఠశాల సమీపంలోని ప్రైవేటు ఖాళీస్థలం, విస్తీర్ణం 6.55 ఎకరాలు, స్నానఘాట్లకు దూరం 1.30 కిలోమీటర్లుగా గొల్లపూడి వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రాంగణం, మధురానగర్ రైల్వేస్టేషన్ సమీపంలో విస్తీర్ణం ఒక ఎకరం, స్నానఘాట్లకు దూరం 6.50 కిలోమీటర్లు, సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య మైదానం వద్ద విస్తీర్ణం 4.50 ఎకరాలు ఘాట్లకు 6 కిలోమీటర్ల దూరం, వైఎస్ఆర్ కాలనీ సమీపంలోని వైవీరావు ఎస్టేట్ ప్రాంగణం వద్ద విస్తీర్ణం 61.92 ఎకరాలు, స్నానఘాట్లకు దూరం 3.20 కిలోమీటర్లు, గుణదల మహానాడురోడ్డు సమీపంలోని సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణం వద్ద విస్తీర్ణం 4 ఎకరాలు, ఘాట్లకు దూరం 6.00 కిలోమీటర్లు, స్కైబ్రిడ్జి సమీపంలోని బాలాజీనగర్ పరిధిలోని దూరదర్శన్ ప్రాంగణం వద్ద విస్తీర్ణం 4 ఎకరాలు, పుష్కరఘాట్లకు 4.30 కిలోమీటర్ల దూరం, కనకదుర్గా వారధి సమీపంలోని ఉడా పార్కు ప్రాగంణం వద్ద విస్తీర్ణం 1.75 ఎకరాలు, ఘాట్లకు దూరం 3.80 కిలోమీటర్లు, పండిట్ నెహ్రు ఆర్టీసి బస్‌స్టాండ్ వద్ద విస్తీర్ణం ఒక ఎకరం, స్నానఘాట్‌కు కేవలం కిలోమీటరు దూరంలో పుష్కర ఘాట్లు ఏర్పాటయ్యాయి.

అలాగే నగరం వెలుపల గూడవల్లిలో, కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం, యనమలకుదురు ప్రాంతంలోని ఖాళీస్థలం, ఇబ్రహీంపట్నం ట్రక్‌టర్మినల్ ప్రాంతం, కొండపల్లి వీటీపీఎస్ మైదానం , రాయనపాడు సీడబ్ల్యూసీ గిడ్డంగి, తుమ్మలపాలెం దేవాదాయశాఖ స్థలం, గుణదల రైల్వేస్టేషన్ సమీపంలో పుష్కర ఘాట్లు ఏర్పాటయ్యాయి. భవానీపురం ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పుష్కరనగర్ షెడ్లు సిద్ధమయ్యాయి.

భవానీపురం ప్రాంతంలో ఎ-స్నానఘాట్‌లైన పున్నమి, భవానీఘాట్లు ఉండటంతో అందుకు తగ్గట్టుగా అధికారులు పుష్కరనగర్లను ఏర్పాటు చేస్తున్నారు. మీనా మార్బుల్స్, వ్యవసాయ మార్కెట్‌యార్డు, ఆర్టీసీ వర్క్‌షాప్ రహదారి, ఎట్కిన్‌సన్ పాఠశాల ప్రాంతాల్లో కూడా పుష్కరనగర్లను ఏర్పాటు చేశారు. వీటిలో షెడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. నాపరాళ్లతో ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. వీటిలో మరుగుదొడ్లను సిద్ధం చేస్తున్నారు. పుష్కరనగర్లలో అదనంగా మరికొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతు న్నారు. క్లోక్‌రూం, చెప్పులస్టాండ్, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు, సమాచార కేంద్రం తదితర సౌకర్యాల పనులు ప్రారంభం కాలేదు.

భవానీపురం పరిధిలో ఉన్న నాలుగు పుష్కరనగర్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏలూరు, బందరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి దూరదర్శన్ వసతిగృహాల ప్రాంగణంలో, వారధి వైపు నుంచి వచ్చే యాత్రికుల కోసం వారధి సమీపంలోని ఉడా పార్కులో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం పండిట్ నెహ్రూ బస్ ప్రయాణ ప్రాంగణంలో పుష్కరనగర్లను ఏర్పాటు చేస్తున్నారు. పుణ్య స్నానాల కోసం వచ్చిన వారు 3 గంటల వ్యవధిలో ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply