విజ‌య‌వాడ‌లో ‘పెళ్ళి చూపులు’…

0
572
2G9A8725
విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రాజ్‌కందుకూరి(ధర్మపథ క్రియేషన్స్‌), య‌ష్ రంగినేని(బిగ్‌ బెన్ సినిమాస్‌), వినూతన గీత బ్యానర్స్ పై  రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంరట్ టైనర్ ‘పెళ్ళి చూపులుస‌.  సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఆగ‌స్ట్ 5న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
సినిమా ఫ‌స్ట్‌కాపీ చూసిన ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సినిమాను అవుట్‌రేట్‌కు కొని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. అంతే కాకుండా సినిమాను విడుద‌ల‌కు ముందే ఇండ‌స్ట్రీలోని సినీ పెద్ద‌ల‌కు, మీడియా ప్ర‌తినిధుల‌కు స్పెష‌ల్ షోస్‌ను వేస్తున్నారు. అందులో భాగంగా జూలై 25న విజ‌య‌వాడ‌లో స్పెష‌ల్ ప్రీమియ‌ర్‌షోను ప్ర‌ద‌ర్శించారు. సినిమా చాలా బావుందంటూ చిత్ర‌యూనిట్‌ను అంద‌రూ ప్ర‌శంసించారు. ఈ ప్రీమియ‌ర్‌కు రీతూవ‌ర్మ‌, డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్ సాగ‌ర్, ప్రియ‌ద‌ర్శి, అభ‌య్ బేతిగంటి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Leave a Reply