ఒక వైపు గొప్ప చిత్రాలు.. మరో వైపు బూతు చిత్రం

0
799
vijayendra prasad direct new adult movie srivalli

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

vijayendra prasad direct new adult movie srivalli
‘బాహుబలి’, ‘భజరంగీ భాయ్‌ జాన్‌’ ఇంకా పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు కథలు అందించిన ఇండియాస్‌ టాప్‌ స్టోరీ రైటర్‌గా పేరు తెచ్చుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్‌ దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మద్య నాగార్జునతో ‘రాజన్న’ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్‌ కాలేక పోయాడు. ఆ సినిమాను నాగార్జున ఎలా ఒప్పుకున్నాడు అంటూ విమర్శలు వచ్చాయి. ఆ సినిమా ఫ్లాప్‌ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న విజయేంద్ర ప్రసాద్‌ మళ్లీ ఇన్నాళ్లకు ‘శ్రీవల్లి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది.

పక్కా బూతు సినిమాగా ‘శ్రీవల్లి’ తెరకెక్కినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. ఒక సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సినిమాను తెరకెక్కించాడట. కథలో భాగంగా హీరోయిన్‌ను చాలా గ్లామర్‌గా, కొన్ని సీన్స్‌లలో పూర్తి వివస్త్రగా కూడా చూపించడం జరిగింది. తక్కువ బడ్జెట్‌తో ఒక బూతు సినిమాగా ఇది రూపొందింది. ఒక వైపు అద్బుత చిత్రాలకు కథలు అందిస్తూ, అద్బుత రచయితగా పేరు సంపాదించిన విజయేంద్ర ప్రసాద్‌ మరో వైపు ఇలాంటి చిన్న బూతు సినిమాలను తెరకెక్కించడం కొందరికి రుచించడం లేదు. జక్కన్న రాజమౌళి తండ్రి అయ్యి ఉండి ఇలాంటి చిన్న బూతు సినిమాలు తీయడం అవమానకరం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Leave a Reply