‘తెనాలి’రామలింగ గురించి సీరియస్ కబుర్లు..

 Posted October 28, 2016

vikatakavi tenali ramakrishna story
వికటకవిగా పేరుపడ్డ తెనాలి రామలింగడు అన్న పేరు వినగానే అయన హాస్యచతురత,బుద్ధి కుశలత మాత్రమే గుర్తొస్తాయి.ఇక పుస్తకాల్లోనూ అయన పుట్టుపూర్వోత్తరాలు కన్నా అయన రచనలు,హాస్యోక్తుల గురించిన సమాచారమే ఎక్కువ.అందుకే తెనాలి రామలింగడి గురించి మాకు తెలిసిన కొన్ని రామలింగని విశేషాలు మీకు అందిస్తున్నాం.

తెనాలి రామలింగని స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని గార్లపాడు.విజయవాడ చెన్నై జాతీయ రహదారికి అనుకుని వుంటుందీ గ్రామం.తెనాలి నుంచి నందివెలుగు మీదుగా గుంటూరు వెళ్తుంటే జాతీయ రహదారికి దగ్గరగా కనిపిస్తుంది ఈ పల్లెటూరు.శివారాధన చేసే గార్లపాటి రామయ్య,లక్ష్మమాంబ దంపతులకి 1495 లోరామలింగడు జన్మించాడు.ఉద్భటారాధ్య చరిత్రం అనే కావ్యంతో ఆయనకి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి.తర్వాత వైష్ణవం వైపు మొగ్గుచూపిన రామలింగడు తిమ్మరుసు సాయంతో రామకృష్ణ కవి పేరుతో విజయనగర సామ్రాజ్యం లోని రాయల వారి భువన విజయం లో స్థానం పొందారు.1520 నుంచి 1530 దాకా అష్టదిగ్గజ కవుల్లో ఒకరిగా వెలిగిపోయారు.

కందర్ప కేతు విలాసం,హరిలీలా విలాసం,పాండురంగ మహత్యం వంటి గ్రంధాలు అయన ప్రతిభాపాటవానికి మచ్చుతునకలు.రాయల వారి కోరిక మేరకు పాండురంగ మహత్యం మొదలుపెట్టిన రామకృష్ణ కవి అయన చనిపోయాక గానీ 1570 లో ఆ గ్రంధాన్ని పూర్తి చేయలేకపోయారు.ఇది తెలుగులో నేటికీ గొప్ప కావ్యాల్లో ఒకటి.ఇక వృద్ధాప్యం మీద పడ్డాక ఘటికాచల మహత్యం రాశారు రామకృష్ణుడు.వివిధ గ్రంధాల్లో తెనాలితో తనకున్న బంధాన్ని నెమరువేసుకున్నారు రామలింగ కవి.అయన పేరిట ప్రచారంలో వున్న హాస్యకథలతో దేశమంతా నేటికీ రామకృష్ణ కవికి గుర్తింపు వుంది.

రామకృష్ణ కవికి ఈ పాండిత్యం ఎక్కడ అబ్బింది అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.స్వగ్రామం గార్లపాడు దగ్గరలోని బట్టుపల్లె లో బట్రాజుల తో కలిసిమెలిసి తిరిగి వారి వల్ల సంస్కృత,ఆంధ్రం లో అయన పట్టు పెంచుకున్నట్టు చెబుతారు.విద్యాభ్యాస కాలంనుంచీ రామకృష్ణుడికి భట్టుమూర్తికి పడేది కాదని వారి రచనలలోనూ అది ప్రతిఫలిస్తుందని చెప్పుకుంటారు.1510 లో తెనాలి రామలింగేశ్వర ఆలయానికి అయన బహుకరించిన ఉమా రామలింగేశ్వర విగ్రహాల్ని నేటికీ చూడవచ్చు.అయన జీవితమంతా హాస్యం,కావ్యం కలగలిసి పోయింది.అందుకే 95 ఏళ్ల సుదీర్ఘ కాలం అయన హాయిగా జీవించగలిగారు.1590 లో రామకృష్ణ కవి మరణించినట్టు తెలుస్తోంది.

SHARE