విలన్ గా ఇరగదీస్తున్న విక్రమ్ ..

0
690

vikram-villan

చియాన్ విక్రమ్ ‘ఇరుముగన్’ ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ట్రైలర్ రిలీజైన రెండు రోజుల్లోనే 30లక్షల హిట్స్‌కు చేరువైంది. ఇక విక్రమ్ విషయానికొస్తే.. హీరో-విలన్ రోల్స్‌ ఆయనే చేస్తున్నారు. హీరో పాత్రపేరు అఖిలన్ కాగా.. విలన్ పేరు లవ్.

‘లవ్’ క్యారక్టర్‌కు స్త్రీ లక్షణాలు ఆపాదించారు దర్శకుడు. ఈ రోల్‌లో విక్రమ్ ఇరగదీశాడని తమిళియన్స్ముచ్చటపడిపోతున్నారు. ఇక ట్రైలర్‌లో లాస్ట్ సీన్‌కు అంతా ఫ్లాటై పోతున్నారు. విమానంలోకి వెళ్తూ.. “ఈ లోకానికి నువ్వు రాజా.. నేను రాణి” అని పలికి.. వయ్యారంగా ఓ ముద్దు విసిరిన తీరు.. మన ‘ఐ’ స్టార్ పనితనానికి నిదర్శనం. ‘ఇరుముగన్’లో చేసిన రెండు పాత్రల్లోనూ తీవ్ర వ్యత్యాసం కనిపించేలా జాగ్రత్తపడ్డారు విక్రమ్. ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, నిత్యమేనన్ హీరోయిన్లు.

Leave a Reply