విక్రమ్ డైరెక్షన్ లో విజయ్ ?

0
437
 vikram direct movie vijay
చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన టాలెంట్ దక్షిణాదికే పరిమితం కాలేదు. హిందీ చిత్రసీమకూ.. తన సత్తా ఏంటో  చాటిచెప్పారు. ‘ఇరుముగన్’తో థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విక్రమ్..ఇటీవలే ‘ద స్పిరిట్ ఆఫ్ చెన్నై’ పేరుతో ఓ పాటను విడుదల  చేశారు. చెన్నైను అతలాకుతలం చేసిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కోలీవుడ్‌ హీరోలను ప్రశంసిస్తూ సాగుతుంది ఈ పాట. ఆ 
సాంగ్ అందరినీ అలరిస్తోంది.
ఇదిలా ఉంటే, ఇటీవలే ఓ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు ఓ సినిమా  డైరక్ట్ చేయాలని ఉందని.. తాను గనుక దర్శకుడినైతే.. హీరోగా ఇళయతలపతి విజయ్‌ను బుక్‌ చేసుకుంటానని చెప్పాడు. విజయ్ బిజీగా ఉంటే.. జయం  రవితో తన స్టోరీ తెరకెక్కిస్తానని అన్నాడు. ఈ స్టేట్‌మెంట్ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.
విజయ్‌ను విక్రమ్ డైరక్ట్ చేస్తాన్ని చెప్పడం… వారి మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనమని అంతా అంటున్నారు. ఏదేమైనా.. ఇంతటి ప్రతిభావంతుడైన నటుడు.. దర్శకుడిగా మారితే.. ఆయన అభిమానులకు అంతకంటే కావాల్సిందేముంటుంది.

Leave a Reply