మరో ప్రయోగం : హాలివుడ్ రిమేక్ లో విక్రమ్

Posted October 5, 2016

  vikram remake hollywood dont breath movie

ప్రతి సినిమా ఓ ప్రయోగంలా ఉండాలని కోరుకునే నటుడు విక్రమ్. ఆయన నటించిన  ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రయోగం చేస్తుంటాడు. ఇప్పుడు విక్రమ్ దృష్టి ఓ హాలీవుడ్ చిత్రంపై పడింది. హాలీవుడ్ లో సంచలనం రేపిన చిత్రం ‘డోంట్‌ బ్రీత్’. మాజీ సైనిక అధికారికి , ముగ్గురు దొంగలకు మధ్య నడిచే హారర్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్ళు సాధించింది. 10 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. 120 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇందులో గుడ్డివాడిగ స్టీఫెన్‌ లాంగ్‌ పాత్ర అదరహో అనిపించింది. ఇప్పుడీ పాత్ర పై చియాన్ విక్రమ్ మనసు పారేసుకున్నాడు.

 ఈ చిత్రాన్ని రిమేక్ చేయాలని భావిస్తున్నాడట. సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని తెరకెక్కించాలని విక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా ఈ చిత్రం మొత్తం కథని కొనే రైట్స్ కోసం ప్రయత్నాలు మొదలెట్టాడట. ప్రస్తుతం దీనికి సంబధించిన చర్చలు జరుగుతున్నాయి. ఓకే అయితే, విక్రమ్ నుంచి ప్రయోగాత్మక  చిత్రాన్ని చూడొచ్చు.

SHARE