ఆరోగ్యం కన్నా తాగుడు ఖర్చు మూడురెట్లు ..

 Posted October 31, 2016

village people spend more money on alchol drinking smoking health purpose few money
గ్రామీణ భారతం గురించి చేదు వాస్తవాలు వెల్లడవుతున్నాయి.పల్లెల పరిస్థితిపై క్రోమ్ డేటా అనలిటిక్స్ అండ్ మీడియా నిర్వహించిన సర్వే గణాంకాలు చూస్తే ఎవరికైనా మతి పోతుంది.పల్లెలు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో అర్ధమవుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో సగటున ఒక్కో మనిషి నెలకి తాగుడికి 140 రూపాయలు,పొగ తాగుడికి 196 రూపాయలు ఖర్చు చేస్తున్నారు.ఈ రెంటి వల్ల పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు పెడుతున్న ఖర్చు నెలకి 56 రూపాయలు మాత్రమే.

గ్రామీణ భారతంలో నెలకి 2800 రూపాయలు మాత్రమే ఓ కుటుంబం నిర్వహణకు పెడుతున్న ఖర్చు.అందులో కిరాణా ఖర్చు 504 రూపాయలు,పాల మీద 224 రూపాయలు, పెట్రోల్ ఇతర వ్యవసాయిక అవసరాలకి 308 రూపాయలు వ్యయం చేస్తునట్టు సర్వే తేల్చింది.19 రాష్ట్రాల్లోని 50 వేల గ్రామాలలోక్షేత్ర స్థాయి సర్వే నిర్వహించాక ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

SHARE