వినాయకుడి వ్యాపారం..

vinyaka temle
ముంబయిలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక ఆలయం.. డిమ్యాట్ అకౌంట్‌ను తెరిచింది. ఇదేంటి వినాయకుడేమైనా స్టాక్ మార్కెట్ లావాదేవీల్లోకి వెళ్తున్నాడా? అనుకుంటున్నారా.. అదేం కాదండి. ఎంతో శక్తివంతమైన దేవుడిగా పేరున్న సిద్ధివినాయకుడి భక్తుల్లో సంపన్నులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు అధికం. ఈ నేపథ్యంలోనే ఆలయ నిర్వాహకులు ఈ డిమ్యాట్ ఖాతాను ప్రారంభించారు. దీంతో ఇకపై ఈక్విటీ షేర్లు, ఇతర సెక్యూరిటీలనూ తమ ఇష్టదైవానికి సదరు భక్తులు సమర్పించుకోవచ్చన్నమాట.

శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయ ట్రస్టు ముంబయి పేరిట ఎస్‌బిఐక్యాప్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌తో డిమ్యాట్ అకౌంట్‌ను సిడిఎస్‌ఎల్ తెరిచింది. సిడిఎస్‌ఎల్ ఓ ప్రముఖ సెక్యూరిటీస్ డిపాజిటరీ. కాగా, దేశంలోని సంపన్న ఆలయాల్లో ఒకటిగా ఉన్న ముంబయి శ్రీ సిద్ధివినాయక ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చిపోతుంటారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులూ నిత్యం దైవ దర్శనానికి వస్తూంటారు. వారు భారీగా నగదు, బంగారం కానుకలను సమర్పిస్తూంటారు.

ఈ క్రమంలో స్టాక్స్, బాండ్లు, సెక్యూరిటీలనూ కానుకలుగా సమర్పించడానికి వీలుగా ఆలయ కమిటీ ఈ డిమ్యాట్ ఖాతాను తెరిచింది. ‘సిద్ధివినాయక భక్తులు ఇకపై తమ కానుకలుగా షేర్లు, సెక్యూరిటీలనూ సమర్పించుకోవచ్చు.’ అని సిడిఎస్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పిఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోగలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here