Posted [relativedate]
ప్రణయకలహాల తర్వాత మళ్లీ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ, అందాల భామ అనుష్క శర్మ పెళ్ళికి సిద్ధమవుతున్నట్టు జాతీయ మీడియా కోడై కూస్తోంది.ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో విహార యాత్ర జరుపుకుంటున్న ఈ జంట జనవరి 1 న నిశ్చితార్ధపు వేడుకలు చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.ఉత్తరాఖండ్ లోని నరేంద్ర నగర్,ఆనందా హోటల్ లో జరిగే ఈ ఫంక్షన్ కోసం బిగ్ బీ అమితాబ్ ,అంబానీ కుటుంబ సభ్యులు సైతం వస్తున్నట్టు చెప్తున్నారు.అయితే విరాట్ కానీ అనుష్క కానీ ఈ వార్తల్ని ధ్రువీకరించలేదు.
మరోవైపు తాము ఉత్తరాఖండ్ లో ఉన్నట్టు అక్కడి టూర్ ఫొటోల్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు.డెహ్రాడున్ లోని ఓ గుడి పూజారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటున్న ఆ జంట ఫోటోని ఓ అభిమాని క్యాప్చర్ చేసాడు.ఇప్పుడే సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పెట్టేబదులు పెళ్లివార్త నిజమో కాదో చెప్తే బాగుంటుందని ఇటు విరాట్ అభిమానులు ..అటు అనుష్క ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.