కదలకుండానే కొత్త ప్రపంచంలోకి……

 Posted October 26, 2016

virtual reality headset feeling like new worldకదలకుండానే కొత్త ప్రపంచంలోకి వర్చువల్‌ రియాలటీ హెడ్‌సెట్‌ మాయ త్రీడీ సినిమాలు థియేటర్‌లోంచి 3డీ టీవీల రూపంలో ఇంటికి వచ్చేశాయి.. ఇప్పుడు  మన మొబైల్‌ ఉపయోగించే ఆ అనుభూతిని సొంతం చేసుకునేలా వర్చువల్‌ రియాలటీ హెడ్‌సెట్‌ చేస్తుంది. మన మొబైల్‌ ఆ 3డీ గ్లాసులలో పెట్టి కావాల్సిన వీడియో లేదా గేమ్‌ ఆడితే చాలు కదలకుండానే మనం ఏదో కొత్త ప్రపంచంలో విహరిస్తాం… ఈ మొబైల్‌ యాక్ససిరీస్‌ ఎలా పనిచేస్తుందో ఈ రోజుపరిశీలిద్దాం…

మొబైల్‌లో ఒక సినిమా చూస్తున్నాం.మధ్యలో మన దృష్టి మరలుతూ స్ర్కీన్‌ చూస్తుంటాం.అదే వర్చువల్‌ రియాలటీ (వీఆర్‌) 3డీ హెడ్‌సెట్‌తో మనసు ఆలోచన దృష్టి అన్నీ కదిలే చిత్రంపై ఉండేలా చేస్తుంది. మన తలకి ధరించే ఈ సాంకేతిక గాడ్జెట్‌ సాయంతో ఎన్నొ అద్భుతాలు జరుగుతాయి. ఒక వైపు  3డీలో చిత్రాలను, గేమ్స్‌ని చూపడంతోపాటు తల చేతులు దాని ఆధీనంలోకి (హెడ్‌ ట్రాకింగ్‌, కంట్రోల్స్‌, హ్యాండ్‌ ట్రాకింగ్‌) వెళ్లి కొత్త అనుభూతి నిస్తుంది. ఇన్ని  ఫీచర్లు ఉన్నాయంటే మన బడ్జెట్‌లో ఉండదు అని కంగారు పడాల్సిన పనిలేదు. మోషన్‌ సెన్సార్‌ల వినియోగం బట్టి రూ.300 నుంచి రూ.30వేల వరకు రకరకాల కంపెనీల వీఆర్‌ హెడ్‌సెట్లు అందుబాటులో ఉన్నాయి. మామూలుగా చూసే చిత్రాలను సైతం కొత్త కోణంలోచూపించడం వీటి ప్రత్యేకత.. అంతే కాకుండా ప్రత్యేకంగా 360 డిగ్రీల వీడియోలు, గేమ్స్‌ ఆడితే అది మాటల్లో చెప్పలేని అనుభూతే మిగులుతుంది. 

virtual reality headset feeling like new worldఅవధులు లేని ప్రపంచం అసలు ఈ వీఆర్‌ ఎలా పనిచేస్తుంది మన కళ్లకు వేరేవి కనిపించకుండా పూర్తిగా దీని ద్వారా చూడాలి. అంటే మన ముందు అవధులు లేని కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనం చిన్నప్పుడు తిరునాళ్లలో ముసుగేసిన రీలు పెట్టెలో ఫొటోలు చూసిన విధంగా ఉంటుంది. ఒక వైపు మొబైల్‌ పెట్టుకుని కళ్లజోడు మాధిరిగా పెట్టుకుంటూ దానికి ఉండే బెల్ట్‌ల సాయంతో తలకి అమర్చుకోవాలి. దానికి వచ్చే స్పీకర్లు మన చెవులకు వచ్చేలా అమరుతాయి. ఒక మొబైలే కాక కంప్యూటర్‌, టీవీల నుంచి ఇన్‌పుట్‌ ఇచ్చేలా కూడా ధరించొచ్చు… రెండు ఎల్‌సీడీ డిస్‌ప్లేలు.. ఖరీదును బట్టి వీఆర్‌ హెడ్‌సెట్లలో ఒకటి లేదా రెండు డిస్‌ప్లేలు ఉంటాయి.మన కంటికీ దృశ్యానికి మధ్యలో లెన్స్‌లు కూడా అమరుస్తారు.ఇవి పిక్సిల్‌ డెన్స్‌టీని సైరైన రీతిలో చూపించే కళ్లజోడుల్లా పనిచేస్తాయి  .. వ్యక్తికి వ్యక్తికి దీని అడ్జస్ట్‌మెంట్‌లో మార్పులు ఉంటాయి. లెన్స్‌లు మన కళ్ల ముందు స్టీరియోస్కోపిక్‌ 3డీ చిత్రాన్ని సృష్టిస్తాయి.

కొన్ని రకాల మోడళ్లు 2డీ చిత్రాలను సైతం  యాంగిల్స్‌ని తీసుకొచ్చి మనల్ని దానికి మమేకమైయ్యేలా చేస్తాయి. 360 డిగ్రీల డిస్‌ప్లేలూ అందుబాటులో… మనం ఎక్కడికి కదలం… ఎక్కడికి వెళ్లం కాని  ఎక్కడికో సుదూర ప్రాంతాల్లో ఉన్నట్లు.. ఒక ఎడారి వీడియోని చూస్తే దాని మధ్యలో నుంచుని చూసిన అనుభూతి కలుగుతుంది. ఉన్నతస్థాయి వీఆర్‌హెచ్‌ లు కూడా 100 డిగ్రీల నుంచి 110 డిగ్రీల కోణం వరకు కనిపించే డిస్‌ప్లేలు వాడుతుంటారు. అవే మన కంటికి అన్ని కోణాల్లో చిత్రాన్ని చూపిస్తుంది. దీంట్లో 360 డిగ్రీల కోణంలో చూపించే డిస్‌ప్లేలు వచ్చాయి కాని చాలా ఖరీదైనవి.. అంత అవసరం కూడా ఉండకపోవచ్చు.
virtual reality headset feeling like new world4డీ, 5డీ ఫీలింగ్స్‌ కూడా పొందొచ్చు… 3డీ చిత్రాల తరవాత మనం 4డీ, 5డీ మూవీస్‌ గురించి వినే ఉంటాం.. కొందరు ఆ అనుభూతి కూడా పొందే ఉంటారు. ఇప్పుడు అదే తరహాలో తల చేతులు దాని ఆధీనంలోకి (హెడ్‌ ట్రాకింగ్‌, కంట్రోల్స్‌, హ్యాండ్‌ ట్రాకింగ్‌) తీసుకుని నేరుగా ఆ వీడియోలో లేదా గేమ్‌లో మనం ఉన్నామనే ఫీలింగ్‌ని కలిగించేలా చేయగలవు..వాడే సెన్సార్ల ఆధారంగా ఇవి పనిచేస్తాయి.మన తల కిందకు వంచితే ఆ చిత్రాలు కూడా దానికనుగుణంగా
మారతాయి.చేతులు కదపడం..మన కదలికలు దానిలో భాగంగా మారిపోతాయి.. ఇన్ని రకాల ఫీలింగ్స్‌ అందించే వీఆర్‌ హెడ్‌సెట్లను మీరు ప్రయత్నించండి మరి…

SHARE