రజని,విశాల్ చెప్పినట్టు చేస్తే బయ్యర్స్ సేఫ్..మరి ఆడియన్స్?

103

Posted [relativedate]

Vishal and rajinikanth says to review reporters don't write review movie release day
వెబ్ జర్నలిజం వచ్చాక ప్రమాణాల మాటేమో గానీ స్పీడ్ మాత్రం పెరిగింది.మిగతా విషయాల్లో ఈ స్పీడ్ తో జరుగుతున్న నష్టం కన్నా సినిమా రంగానికి చేటు ఎక్కువైపోయింది.స్పీడ్ గా రివ్యూ ఇవ్వడం కోసమని సినిమా అయిపోయేదాకా కూడా ఆగడం లేదు.సినిమా చేస్తున్నప్పుడే అప్పటికప్పుడు తమకు తోచిన నాలుగు ముక్కలు సెల్ ఫోన్ లోనే రాసి పంపేస్తున్నారు. వాటి ఆధారంగా మార్నింగ్ షో పూర్తి అయ్యీ కాక ముందే వెబ్ సైట్స్ లో సినిమా రివ్యూ వచ్చేస్తోంది.ఆ రివ్యూ లో పస వున్నా లేకున్నా సినిమా మీద ప్రభావం చూపిస్తోంది.ఈ సమస్య లేకుండా ఉండాలంటే ఓ పరిష్కారం ఉందంటున్నారు హీరో విశాల్.ఇటీవలే తమిళ నిర్మాతల కౌన్సిల్ చైర్మన్ గా కూడా ఎన్నికైన విశాల్ చెప్పిన పరిష్కారం ఏమిటంటే …రివ్యూలు రాసేవాళ్ళు కాస్త సంయమనం పాటించి సినిమా విడుదలైన నాలుగో రోజు విశ్లేషణలు బయటికి వచ్చేలా చూడాలి.ఈ ప్రతిపాదన బాగుందని సూపర్ స్టార్ రజని కాంత్ కూడా అన్నారు.

విశాల్,రజని చెప్పినట్టు చేస్తే నిజంగానే బయ్యర్స్ కొంతవరకు సేఫ్ అవుతారు.పబ్లిసిటీ,క్రేజ్ తో మూడు రోజులు లాగించేస్తే బయ్యర్లు చాలావరకు తమ పెట్టుబడి వెనక్కి లాగుతారు.పెద్ద హీరోల విషయంలో ఆ గారంటీ ఉంటుంది.అంతవరకు బాగానే వున్నా ఈ అవకాశాన్ని వాడుకుని తలాతోకా లేని సినిమాలు తీసి ప్రేక్షకుల మీదకి వదిలితే టికెట్ కొన్న ప్రేక్షకుడికి జవాబుదారీ ఎవరు ? దానికి బాధ్యత ఎవరు వహిస్తారు.సినిమాకి రాజపోషకుడైన ప్రేక్షకుడు నష్టపోతే పర్లేదా ? కానీ సినిమా రంగం ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి.అతి అరుదైన ఏదో ఒక సందర్భంలో తప్ప దమ్మున్న సినిమాని ఏ రివ్యూ అడ్డుకోలేదు.గొప్ప రివ్యూ ఏ చెత్త సినిమాని కాపాడలేడు.ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా దాని పరిధి,పరిమితి స్వల్పమే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here