Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు బ్రేక్ చేసింది. మరో వైపు ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే పైరసీ అయ్యింది. విడుదలైన అన్ని భాషలకు సంబంధించిన సీడీలు మరియు ఆన్‌లైన్ లింక్‌కుల అందుబాటులోకి వచ్చాయి. ‘బాహుబలి 2’ సినిమా తమిళనాట విపరీతంగా పైరసీ అయ్యింది. దాంతో అక్కడ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.
ఈ సమయంలోనే తమిళనాడు పోలీసులకు కోలీవుడ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు అయిన విశాల్ ‘బాహుబలి’ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది. ‘బాహుబలి 2’ సినిమా పైరసీ డీవీడీలు మరియు ఆన్‌లైన్ లింక్‌లను తొలగించాలంటూ పోలీసులకు విశాల్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే బాహుబలి 2 పైరసీని అరికట్టాల్సిందిగా ఆయన కోరాడు. ముఖ్యంగా బాహుబలి 2 తమిళ వర్షన్ పైరసీ ఎక్కువగా అవుతుంది. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ విశాల్ డిమాండ్ చేస్తున్నాడు.
