విశాల్ అతనిపై కేసు వేస్తాడట

Posted November 14, 2016

vishal ready to file case on sarath kumarకోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నడిగర్ సంఘం ఎన్నికల దగ్గర నుండి ఆపోనెంట్ యాక్టర్ శరత్ కుమార్ తో గొడవలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇంతకుముందు శరత్ కుమార్ విశాల్ మీద కేసు పెట్టడం ఆ తర్వాత రాజి కుదరడం జరిగింది. ఇప్పుడు విశాల్ శరత్ కుమార్ మీద కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడని టాక్. నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గా శరత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గా రాధారవిలు కలిసి సఘానికి చెందిన స్థలాన్ని అమ్ముకున్నారని.. దానికి సంబందించిన వివరాలతో విశాల్ శరత్ పై కేసు వేసేందుకు సిద్ధమయ్యాడు.

అయితే విశాల్ చేస్తున్న ఆరోపణలు అన్ని ఖండిస్తూ తాము ఎలాంటి తప్పు చేయలేదని ఎదురుగా విశాల్ మీదే మళ్లీ పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యాడు శరత్ కుమార్. నడిగర్ సంఘం ఎలక్షన్స్ అయ్యి దాదాపు సంవత్సరం కావొస్తున్నా శరత్, విశాల్ ల మధ్య గొడవలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక విశాల్ మాత్రం సిని శ్రామికులకు అందాల్సిన వన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.

విశాల్ వెనుక నాజర్, కార్తి లాంటి వారు సపోర్ట్ గా ఉన్నారని తెలిసిందే. సిని పరిశ్రమలో జరుగుతున్న అల్ల కల్లోలాలను సహించేది లేదని.. కచ్చితంగా ఉన్నాడు విశాల్ మరి శరత్ కుమార్ ఈ విషయం పట్ల ఎలా స్పందిస్తాడో చూడాలి.

SHARE