వామ్మో.. విశాల్‌ మామూలోడేం కాదుగా!!

Posted April 20, 2017 at 19:23

Vishal said to producers give One Rupee from Cinema ticket will go to farmers
తమిళ నటుల సంఘం కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని, విజయంతం చేసిన విశాల్‌ తాజాగా తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెల్సిందే. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్‌ ఎన్నికైన వెంటనే ప్రతి సినిమా టికెట్‌పై ఒక రూపాయిని రైతుల కోసం ప్రతి నిర్మాత ఇవ్వాలని నిర్ణయించాడు. విశాల్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు అంతా హర్షం వ్యక్తం చేసి అభినందించగా, కొందరు నిర్మాతలు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇప్పటికే నిర్మాతుల కలెక్షన్స్‌ రాక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఇదేంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తన నిర్ణయంలో మార్పు లేదు అని, అయితే నిర్మాతలకు కొత్త ఆధాయ మార్గాలను అన్వేషించేందుకు విశాల్‌ సిద్దం అయ్యాడు. ప్రస్తుతం ప్రతి న్యూస్‌ ఛానెల్‌ మరియు ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఛానెల్‌ కూడా తమ సినిమాలకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ను వాడుకుంటూ ఉంటాయి. వాటికి డబ్బులు వసూళ్లు చేయండి. టీవీ ఛానెల్స్‌ సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ను వాడుకోవాలంటే ఇంత అమౌంట్‌ కట్టాలంటూ కొత్త నిర్ణయం తీసుకుందాం. అలాగే ట్రైలర్స్‌ మరియు పాటలను కూడా కొంత మొత్తం ఇచ్చే టీవీల్లో ప్రసారం చేసుకునేలా నిబంధన తీసుకు రావడం వల్ల నిర్మాతకు కొత్త ఆధాయ మార్గం అవుతుందని విశాల్‌ నిర్మాతల మండలి ముందుకు తన నిర్ణయాలను తీసుకు వచ్చాడు. విశాల్‌ తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలు నిర్మాతలను ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు మీడియా వారు మాత్రం విశాల్‌ నిర్ణయాన్ని తప్పుబుతున్నారు.

SHARE