హన్సికతో మళ్ళీ విష్ణు..

0
425

  vishnu act hansika raj kiran movieవిష్ణు హీరోగా రాజ్ కిరణ్ దర్శకత్వంలో, ఒక కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కనున్నట్టు కొన్ని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం కొంతకాలంగా అన్వేషిస్తోందని చివరికి ముద్దుగుమ్మ హన్సికను ఖరారు చేసుకుందని లేటెస్ట్ టాక్. గతంలో విష్ణు – హన్సిక కాంబినేషన్లో వచ్చిన ‘దేనికైనా రెడీ’ సినిమా, ఘన విజయాన్ని అందుకుంది. తర్వాత ‘పాండవులు పాండవులు తమ్మెద’లోనూ ఈ జంట కనువిందు చేసింది. ఇదిలా ఉంటే, ‘పవర్’ సినిమా తరువాత తెలుగులో హన్సిక నటించలేదు. తమిళంలో వరుస సినిమాలతో ఆమె చాలా బిజీగా వుంది. ఏదైమైనా హన్సిక మరోసారి టాలీవుడ్ వైపు రావడం తెలుగు రాష్ట్రాల్లోని ఈ సొగసరి అభిమానులకు శుభవార్తే.

Leave a Reply