వచ్చే నెల ముంచుకొస్తున్న “మంచు”..!!!

Posted [relativedate]

vishnu manoj and lakshmi movies are back to back release in february
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద ఫ్యామిలీగా పేరు తెచ్చుకుంది మంచు ఫ్యామిలి. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న మంచు వారసులందరు వచ్చే నెలలో ఒక్క సారిగా ప్రేక్షకులపై దండెత్తనున్నారు. వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో తమ సినిమాలను వరుసగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.

రాజాకిరణ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన ‘లక్కున్నోడు’చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాను ఢీ తరహాలో రూపొందించామని, విష్ణు ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయమని చిత్ర యూనిట్‌ తెలిపింది. సరిగ్గా వారం తర్వాత మంచు మనోజ్ గుంటూరోడుగా థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ తోనే మాస్‌ ప్రేక్షకులను అలరించిన ఈ గుంటూరోడు ఎలాంటి హిట్ కొడతాడో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక, మంచు లక్ష్మి లీడ్‌ రోల్‌లో నటించిన ‘లక్ష్మీబాంబ్‌’ కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయింది. అయితే నోట్ల రద్దు, పెద్ద సినిమాల విడుదల వంటి కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. అదండీ … ఒకే కుటుంబం నుండి ఒకే నెలలో రానున్న ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరిస్తాయో చూడాలి.

 

Leave a Reply