అమరావతిలో విట్ దత్తత గ్రామాలివే..

 Posted November 1, 2016

vit university take adoption 3 villages in amaravati
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీ రాజధాని అమరావతిలో విట్ విశ్వవిద్యాలయ తరగతులు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతున్నాయి.ఈ నెల 3 వ తేదీన విట్ శంఖుస్థాపన కార్యక్రమం జరగనుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు,కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందని విట్ చైర్మన్ విశ్వనాథన్ తెలిపారు. తొలి విడతలో 100 ఎకరాల్లో నిర్మాణం జరపనున్నట్టు కూడా అయన వివరించారు.2017 జులై నుంచి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.

అమరావతిలో నెలకొల్పే తొలి విశ్వవిద్యాలయంగా విట్ నిలవనుంది. ఏపీ లో విద్యార్ధులకి నాణ్యమైన విద్యని,ఉజ్జ్వలమైన భవిష్యత్ అందిస్తామని విట్ ప్రతినిధులు చెప్తున్నారు.విట్ నిర్మాణం జరిగే వెలగపూడి,శాఖమూరు,ఐనవోలు గ్రామాలను దత్తత తీసుకోడానికి విట్ ముందుకొచ్చింది.ఆ గ్రామాల అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించడానికి విట్ కొన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది.

SHARE