ఓటింగ్ యంత్రాలు.. ఓటి మాటలు

0
511
voting techniques for evms

Posted [relativedate]

voting techniques for evmsఅభివృద్ధి చెందిన దేశాలకు సైతం సాధ్యం కాని రీతిలో విజయవంతంగా ఈవీఎంలు ఉపయోగిస్తున్న చరిత్ర మన దేశానిది. ఇక్కడ వంద శాతం అక్షరాస్యత లేకపోయినా ఓటర్లంతా కచ్చితంగా తామెవరికి ఓటెయ్యాలో వారికే మెషిన్ ద్వారా వేయడం అందర్నీ అబ్బురపరుస్తోంది. ఈవీఎంలపై ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల సంఘం అఖిలపక్ష పార్టీల సమావేశం పెట్టి.. ట్యాంపరింగ్ వీలు కాదని అందరి ముందు నిరూపించింది. అయినా సరే యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తర్వా.. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు మద్దు అంటూ విపక్షాలు పాత పాటే పాడుతున్నాయి.

అఖిలేష్ యాదవ్.. 2012 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే సీఎం అయ్యారు. అంటే అప్పుడు కూడా మిషన్లు ట్యాంపర్ అయ్యాయా. అదే నిజమైతే అఖిలేష్ కు ట్యాంపరింగ్ తెలిసే ఉండాలి. తెలిస్తే, ఈసారి మాత్రం ఆయన ఎందుకు ఓడిపోతారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు రికార్డు స్థాయిలో 67 గెలుచుకున్న కేజ్రీ కూడా.. ఈవీఎంల ద్వారానే విజయం సాధించారు. ఇప్పుడు ట్యాంపరింగ్ కు పది సూత్రాలంటూ కేజ్రీ చెబుతున్న మాటలు.. ఢిల్లీ ఓటర్లకే చిరాకు పుట్టిస్తున్నాయి.

ఇక బీహార్ మాజీ సీఎం లాలూ. బీజేపీని అడ్డుకోవడమే జీవితాశయంగా సీఎం సీటును త్యాగం చేసి మరీ నితీష్ కు మద్దతు పలికి.. ఈవీఎంల ద్వారానే విజయం సాధించారు. కానీ యూపీలో బీజేపీ గెలుపు మాత్రం ట్యాంపరింగ్ ద్వారానే సాధ్యమైందనడం ఏమాత్రం మర్యాద అనిపించుకుంటుందో ఆయనకే తెలియాలి. బీజేపీ దగ్గరే ట్యాంపరింగ్ టెక్నాలజీ ఉంటే పంజాబ్ లో అంత ఘోరంగా ఎందుకు ఓడిపోతుందన్న ప్రశ్నలకు ఈ నేతల దగ్గర ఆన్సర్ లేదు. అంతెందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఈవీఎంలో లోపాల్లేవని చెబుతున్నా.. ఈ నాయకులకు తలకెక్కడం లేదు.

Leave a Reply