మళ్లీ డైలామాలో వి.వి. వినాయక్..

 Posted March 25, 2017

vv vinayak not announced to new movieవి.వి. వినాయక్ .. ఒకప్పుడు  టాలీవుడ్ భారీ బడ్జెట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్. కెరీర్ స్టార్టింగ్ లో ఏడాదికి రెండు సినిమాలు చేసిన ఈ దర్శకుడు యోగి సినిమా కొట్టిన దెబ్బతో రెండు సంవత్సరాలకు ఒక సినిమాను చేస్తున్నాడు. ఇటీవల అఖిల్ సినిమా అడ్డగోలగా తీశాడు అన్న పేరు రావడంతో రెండు సంవత్సారలకు ఒక సినిమా కూడా కరువైంది. అయితే రీసెంట్ గా చిరు రీ ఎంట్రీ పుణ్యమా అని ఆ సినిమాకు దర్శకత్వం వహించి మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు కన్పించాడు. అయితే అతను మళ్లీ డైలమాలో పడ్డాడు.

ఖైదీ నెం. 150 లాంటి ఇండస్ట్రీ హిట్ ని అందుకుని కూడా మూడు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. మధ్యలో మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ లతో సినిమా ఉంటుందని ఎనౌన్స్ అయినా వాటి జాడే లేకుండా పోయింది.

ప్రస్తుతం వరుస ఫ్లాఫ్ లను అందుకుంటున్న సాయిధ‌ర‌మ్,  మంచు మ‌నోజ్‌ లతో సినిమా అంటే ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదని భావిస్తున్నాడట. ఇక స్టార్ హీరోలతో సినిమా అంటే.. ఎవరికి వారు బిజిగా ఉన్నారు. బాలయ్య తన సినిమాను మొదలు పెట్టేయ్యగా  చిరు వచ్చే నెల నుండి ఉయ్యాలవాడను సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నాడు. వెంకీ కూడా వేరే సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు. ఇక అఖిల్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో నాగ్ కాంపౌండ్ లో నో ఎంట్రీ. మరి వినాయక్ ఈ సమస్య  నుండి ఎప్పుడు బయటపడతాడో… ఏ హీరోతో సినిమాను ఎనౌన్స్ చేస్తాడో చూడాలి.

SHARE