పార్టీ అధ్యక్షుడితో ఏపీమంత్రికి విభేదాలు!!

0
312
war between venkatrao and achennayudu

Posted [relativedate]

war between venkatrao and achennayudu
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే జిల్లాకు చెందిన నాయకులు ఇలా తగవులాడడంపై క్యాడర్ లో అసహనం వ్యక్తమవుతోందని సమాచారం.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ఇద్దరూ ఇద్దరే. కళా వెంకట్రావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ… చక్రం తిప్పుతున్నారు. అటు అచ్చెన్నాయడు కూడా తానేం తక్కువ కాదంటూ మినిస్టర్ గా దూసుకుపోతున్నారు. అయితే పార్టీ పదవుల పంపకాలు, ఇతర నామినేటెడ్ పదవులు, అభివృద్ధి పనుల విషయంలో అచ్చెన్నాయుడికి ప్రాధాన్యం లభిస్తుందని.. కళా వెంకట్రావు ఆగ్రహంతో ఉన్నారట. అందుకే అచ్చెన్నపై కళా వెంకట్రావు గరంగరంగా ఉన్నారు. అంతేకాదు అచ్చెన్నకు పోటీ … కళా వెంకట్రావు కూడా కొందరు నాయకులను బాగా ప్రోత్సహిస్తున్నారట. అచ్చెన్న గ్రూప్ నుంచి కొందరిని లాగే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఈ ఇద్దరి మధ్య జిల్లా టీడీపీ క్యాడర్ నలిగిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది.

ఈ ఇద్దరి విభేదాల విషయం.. చంద్రబాబు దృష్టికి వెళ్లిందట. బాబు గారు ఇద్దరినీ పిలిచి గట్టిగానే క్లాస్ తీసుకున్నారని సమాచారం. కొన్నిరోజులు బాగానే ఉన్నా… పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని టాక్. ఇక లాభం లేదని మళ్లీ బాబుకు కంప్లయింట్ చేసేందుకు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారని సమాచారం.

అచ్చెన్నాయుడు… బాబుకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. కానీ ఈ మధ్య కాలంలో అది మారిందట. ఒకవేళ అచ్చెన్నపై మరోసారి కంప్లయింట్ వెళ్తే ఆయనకే కష్టమంటున్నారు టీడీపీ క్యాడర్. !!

Leave a Reply