ఎదురు”గాలి” వీస్తోంది!!!

0
371
war in families of gali brothers

Posted [relativedate]

war in families of gali brothers
బళ్లారి బాబు గాలి జ‌నార్థ‌న్ రెడ్డి కుటుంబంలో చిచ్చు రేగింది. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. చివ‌ర‌కు ఒక‌రి మొహం ఒక‌రు చూసుకోవ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఒక‌ప్పుడు క‌లిసి మెల‌సి మైనింగ్ సామ్రాజ్యాన్ని విస్త‌రింప‌జేసిన‌ బళ్లారి బ్ర‌ద‌ర్స్ ఇప్పుడు కొట్టుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది.

గాలి సోద‌రులు మొత్తం ముగ్గురు. ఇందులో గాలి క‌రుణాక‌ర్ రెడ్డి, జ‌నార్థ‌న్ రెడ్డి రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇక శ్రీరాములుతో వీరికి ఎలాంటి బంధుత్వం లేక‌పోయిన‌ప్ప‌టికీ… ఆయ‌న‌ను నాలుగో సోద‌రుడిగా చెబుతుంటారు. అలాంటిది ఈ కుటుంబంలో ఒక్క‌సారిగా చీలిక వ‌చ్చేసింది. ఆస్తుల పంప‌కాల్లో తేడా వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గాలి క‌రుణాక‌ర్ రెడ్డికి… జ‌నార్ద‌న్ రెడ్డి ఆస్తిలో త‌గిన వాటా ఇవ్వ‌లేద‌ని టాక్. అంతేకాదు క‌రుణాక‌ర్ రెడ్డికి ద‌క్కాల్సిన ఆస్తుల‌ను శ్రీరాములుకు రాసిచ్చార‌ట జనార్థ‌న్ రెడ్డి. దీంతో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం వేడెక్కింది.

ఇటీవ‌ల గాలి జ‌నార్థ‌న్ రెడ్డి త‌న కూతురి వివాహాన్ని గ్రాండ్ గా చేశారు. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలోనూ గ్రాండ్ వెడ్డింగ్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ వివాహానికి కూడా క‌రుణను పిల‌వ‌లేద‌ట జ‌నార్ధ‌న్ రెడ్డి. దీంతో ఈ గొడ‌వ‌లు మ‌రింత ముదిరాయ‌ని స‌మాచారం. అంతేకాదు క‌రుణాకర్ రెడ్డి ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్లారు. ఇదంతా శ్రీరాములు వ‌ల్లే జ‌రుగుతోంద‌ని క‌రుణాకర్ రెడ్డి చెబుతున్నారు. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య చిచ్చు పెట్టింది అతనేనని మండిప‌డుతున్నారాయ‌న‌.

మొత్తానికి ఒక‌ప్పుడు క‌ర్ణాట‌క బీజేపీకి అండ‌దండ‌గా నిలిచిన గాలి కుటుంబం ఇప్పుడు ఇలా కొట్టుకోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. అంతా డ‌బ్బు మ‌హిమ‌. డ‌బ్బు ముందు ర‌క్త‌సంబంధీకులు… బంధుత్వాలు ఏవీ క‌నిపించ‌వు!!! డ‌బ్బు ఎంత‌టివారినైనా మార్చేస్తుంది అన‌డానికి గాలి ఫ్యామిలీ వార్ ఒక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే!!!!

Leave a Reply