నీరు అంటే భూమి నివాసించే జీవులంన్నింటికీ జీవానాధారం. అధిక నీరు తీసుకుంటే…ఆరోగ్యానికి మంచిదని పెద్దలు తీసుకుంటారు. అలాగే తినేటప్పుడు నీరు తాగితే మంచిదని కొందరూ అంటారు. మరికొందరూ ఈ విషయాన్ని ఖండిస్తుంటారు. దీనిపై కొందరూ పరిశోధనలు జరిపారు. దీంతో నీటిపై స్పష్టతను తీసుకొచ్చారు.
భోజనం చేసేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే..కడుపు నిండిందనే సంకేతాలు మెదడుకు చేరి…ఆకలికి అడ్డుకట పడుతుందని తాజా అధ్యయనం వెల్లడైంది. దీని వల్ల ఆహారం తీసుకునేటప్పుడు పొట్ట మాటల్ని మెదడు వినే విషయంలో శాస్త్రవేత్తలకు కొత్త మార్గాలకు దారి చూపినట్లవుతుందని భావిస్తున్నారు.
నెదర్లాండ్స్‌లోని వాజెనింజెన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తొలిసారిగా..ఆహారం తీసుకునేటప్పుడు మెదడు, పొట్ట, తినేవారిలో సంతృప్తి భావనల్ని వాస్తవిక రీతిలో పరిశీలించారు. పొట్ట ఎంఆర్ ఐతో పాటు, మెదడుకు ఫంక్షనల్ ఎంఆర్ ఐ స్కానింగ్ చేపట్టడం ద్వారా…తినేటప్పుడు పొట్టకు సంబంధించిన సంకేతాల్ని మెదడు ఎలా స్వీకరిస్తుందనే అంశంపై సరొకొత్త అంశాల్ని గ్రహించారు.
ఆహారం తీసుకునేటప్పుడు నీరు ఎక్కువగా తాగడం వంటి చిన్నపాటి మార్పుల వల్ల కూడా పొట్ట నిండిందన్న సంకేతాలు మెదడుకు చేరుతున్నట్లు గుర్తించారు. తినేటప్పుడు తాగేనీటి పరిమాణాన్ని పెంచడం ద్వారా పొట్ట విస్తరణ పెరుగుతోందనీ..స్వల్పకాలంలో ఆకలికి అడ్డుకట్ట పడుతోందనీ…స్వల్పకాలంలో ఆకలి అడ్డుకట్ట పడుతోందనీ..మెదడు క్రియాశీలత పెరుగుతోందని తమ పరిశీలనలో గుర్తించినట్లు పరిశోధకులు గ్విడ్ క్యాంప్స్ పేర్కొన్నారు.