హీరోయిన్‌లకు మేమేం తక్కువ కాదు..!

0
609
we are not low than heroines in exposing

Posted [relativedate]

we are not low than heroines in exposing
తెలుగు బుల్లి తెరకు గ్లామర్‌ అద్దిన యాంకర్స్‌లో రష్మీ మొదటి వరుసలో ఉంటుంది. జబర్దస్త్‌ కార్యక్రమంలో ఈమె కాస్ట్యూమ్స్‌ ఏ స్థాయిలో హాట్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు జబర్దస్త్‌తో పాటు అప్పుడప్పుడు హీరోయిన్‌గా కూడా వెండి తెరపై మెరుస్తూ ఉంటుంది. తాజాగా ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. అందాల ప్రదర్శన గురించి ఈమె ఆ వ్యాఖ్యలు చేసింది.

ఇంతకు రష్మీ ఏమందంటే.. హీరోయిన్స్‌ అందాల ప్రదర్శన చేస్తే లేని తప్పు యాంకర్స్‌ కాస్త గ్లామర్‌గా కనిపిస్తే తప్పేంటి, వారు బికినీ వేసినా కూడా తప్పేం లేదు, హీరోయిన్స్‌ బికినీ వేసిన సినిమాలు బుల్లి తెరపై వస్తుంటాయి. అప్పుడు చూడంగా లేనిది కొన్ని కార్యక్రమాల్లో తెలుగు యాంకర్స్‌ కాస్త హాట్‌గా కనిపిస్తే తప్పేంటి అంటూ రష్మీ ప్రశ్నిస్తుంది. తెలుగు అమ్మాయిలు అయినంత మాత్రాన హాట్‌గా కనిపించకూడదు అని ఏమైనా రూల్‌ ఉందా అంటూ ఈమె ప్రశ్నించింది. రష్మీ వాదనను ఎక్కువ శాతం నెటిజన్స్‌ ఏకిభవిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు సరైనవే అని, ముంబయి హీరోయిన్స్‌ గ్లామర్‌ చూడటానికి ఇష్టపడే వారు తెలుగు యాంకర్స్‌ గ్లామర్‌గా కనిపిస్తే విమర్శలు చేయడం ఎందుకని నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply