మాకదే కావాలి … మోడీతో బాబు

0
463

babu-modi-meeting

‘మాకు ప్రత్యేక హోదా మాత్రమే కావాలి’ … ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా చూపిన మాటలివి. కేవీపీ ప్రైవేట్ బిల్లు తర్వాత ఒక్కసారిగా ప్రత్యేక హోదా అంశం రాజు కొంది. పెద్దల సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం తర్వాత రాజుకున్న అగ్గిదావానలమైంది. AP ఉద్యమ సెగలు వ్యాపించాయి. టీడీపీ, బీజేపీ మధ్య మాటలయుద్ధం మొదలైంది.

ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణాపుష్కర ఆహ్వానం కోసమనే వెళ్లినప్పటికీ ఇద్దరిమధ్య ప్రధానంగా నలిగిన అంశం ప్రత్యేకహోదా మాత్రమే… దాదాపు 20 నిమిషాలపాటు ఇద్దరు నాయకులూ ముఖాముఖీ మాట్లాడుకున్నారు. సాంకేతిక అంశాలతో ప్రత్యేకహోదా అంశాన్ని పక్కనబెడితే రాజకీయంగా విపక్షాలు ఎంతగా లాభపడతాయో మోడీకి బాబు వివరించారు.

2014 ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ సంయుక్తంగా ఇచ్చిన హామీల్ని బాబు మరోసారి మోడీకి గుర్తుచేశారు. మొత్తానికి మోడీ సానుకూలంగా వ్యవహరిస్తారన్న ఆశాభావం బాబు మాటల్లో వ్యక్తమైంది. అయితే అది ఎంతవరకు నిజమన్నది తేలాల్సి వుంది. ఎందుకంటే … గడిచిన రెండేళ్లలో ఇలాంటి చర్చలు , సంప్రదింపులు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఎన్నో దఫాలు ఇలాంటి ప్రకటనలు వచ్చాయి. కానీ ఈసారి పార్లమెంట్ లో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భిన్నమైన వాతావరణం ఉందని బీజేపీ కి కూడా అర్థమైంది. అందుకే ఈసారి భేటీపై ఇన్ని ఆశలు.

Leave a Reply