ఐ ఏఎస్ మ్యారేజ్ @ 500

198

Posted November 30, 2016, 5:47 pm

Image result for saloni sidana

గుజరాత్ లోని సూరత్ లో 500 కే వివాహం చేసుకొన్న జంట గురించి మొన్న విన్నాం నిన్న మోడీ మం కి బాత్ లో ఆ జంటను పొగడటం చూశాం. ఈ రోజు ఇద్దరు ఐ ఏ ఎస్ అధికారులు కూడా నిరాడంబరం గా అక్షరాలా 500 ఖర్చుతో వివాహం చేసుకొన్నారు ఆ విషయం ఏంటో చూద్దాం …

మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆశిష్ వశిష్ట ప్రస్తుతం గోహాడ్‌లో ఎస్డీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు ఆయన పెళ్లి చేసుకున్న సలోని సిదానా విజయవాడలో ఎస్డీఎంగా పనిచేస్తున్నారు. 2013లో ఐఏఎస్ పరీక్షను పాసైన వీరిద్దరు ముస్సోరిలో శిక్షణ సమయంలో ప్రేమించుకొన్నారట.

వివాహానికి సంబంధించి అనుమతి ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్‌లోని బింద్‌ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు ఆశిష్ వసిష్ఠ . దీంతో కోర్టు వారికి నవంబర్‌ 28వ తేదిని కేటాయించింది. ఈ నేపథ్యంలో కోర్టు వద్దకు వచ్చిన ఇరు కుటుంబాల సభ్యులు చట్టపరంగా చేయాల్సిన ఫార్మాలిటీ పూర్తి చేసుకొని వివాహం చేసుకున్నారు. ఆశిష్ది రాజస్థాన్‌ కాగా సలోనిది పంజాబ్‌. ప్రస్తుతం వీరి వివాహం కావడంతో సలోనికి కూడా మధ్యప్రదేశ్‌ కేడర్‌లో పనిచేసే అవకాశం దక్కనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here