ఆటాడి వేటాడిన తిమింగలం..తాబేలు బలి

0
549

 Whale play game eat Tortoise

అది ఈక్వెడార్ లోని బొలీవర్ చానెల్ సముద్రం..అందులో బోటింగ్ కి వెళ్ళింది ఓ టీం .సముద్ర అందాల్ని వీడియో తీస్తుండగా ఓ అరుదైన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. ఓ భారీ తిమింగలం,ఓ తాబేలు ఆటాడుకుంటున్నాయి.ఆ తిమింగలం అంతెత్తున తాబేలు ని పైకి విసిరేసి మళ్లీ పట్టుకుంటోంది.అబ్బో ఈ స్నేహం,ఆటలు భలే చిత్రంగా వున్నాయి అనుకుంటున్నారు ..

ఇంతలోనే ఓ సాధారణ దృశ్యం…అప్పటికి వాళ్ళు ఊహించని పరిణామం కంటి ముందు నిలిచింది.పైకి విసిరిన తాబేలుని ఒడిసి పట్టుకున్న తిమింగలం దాన్ని కరకర నమిలి మింగింది.చూసేవాళ్ళకి భాధ కలిగింది .అంత బాధలోనూ ఓ నీతి తెలిసింది..వేట లక్షణమున్న వారితో ఆట ప్రమాదమని అర్ధమైంది.

Leave a Reply