Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో ఏమైంది? బాబు మీద ఇర్వింగ్ మేయర్ కి ఫిర్యాదు చేయడంలో వైసీపీ హస్తం లేదా ? మరి మీడియాలో ఈ వార్తలు ఎందుకు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంటే ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. జరిగిన ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఆంధ్రజ్యోతిలో బాబు ఇర్వింగ్ పర్యటన గురించి వచ్చిన వార్తలో నిజం లేదని వైస్సార్సీపీ అమెరికా కమిటీ వాదిస్తోంది.ఇర్వింగ్,టెక్సాస్ లో చంద్రబాబు టూర్ సందర్భంగా ఫండ్ రైజింగ్ చేయడాన్ని తప్పుబడుతూ వైసీపీ కార్యకర్తలు స్వల్ప స్థాయిలో నిరసన చేపట్టారట.అయితే దాన్ని కూడా తట్టుకోలేకే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేపట్టారని వైసీపీ అభిమానులైన nri లు కొందరు చెబుతుండగా,ఇంకొందరు ఆ నిరసన కార్యక్రమంతో వైసీపీ ఫాలోయర్స్ కి ఏ సంబంధం లేదని వాదిస్తున్నారు.వైసీపీ లోనే ఈ వ్యవహారం మీద రెండు రకాలుగా మాట్లాడ్డం,బాబు అమెరికా టూర్ లో ఆయన్ని కలవాలంటే టికెట్ కొనాలని సాక్షి చేసిన కధనం చూస్తుంటే …ఈ టూర్ లో బాబు ఏదైనా సాధిస్తే అది బయటకు రాకుండా లేనిపోని రచ్చ చేయడానికి ముందుగానే ప్లాన్ జరిగినట్టుంది.
ఈ విషయంలో చంద్రబాబు అండ్ కో కాస్త అప్రమత్తంగా వ్యవహరించేసరికి మొత్తం గుట్టు బయటపడిపోయింది.అయినా చంద్రబాబు విధానాల మీద అమెరికాలో కూడా వైసీపీ తరపున నిరసన తెలిపింది నిజమైతే అది సమంజసమో..కాదో జగన్ అండ్ కో తేల్చుకోవాలి.పైగా ఇప్పుడు జరిగిన రాద్ధాంతం వల్ల అమెరికాలో ఆంధ్రా పరువుకు గండి కొట్టింది ఎవరో తేలిగ్గా అర్ధం అవుతుంది.ఆంధ్ర రాజకీయాల రచ్చని అమెరికా దాకా తీసుకెళ్లి జగన్ బావుకొనేది ఏమీ ఉండదు.పరాయి గడ్డ మీద బాబుని సాధించడమంటే ఆ అవమానం టీడీపీ అధినేతకు మాత్రమే కాదు .ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి జరిగిన అవమానంగా భావించాల్సి ఉంటుంది.వైసీపీ వ్యూహకర్తల తీరు మారకంటే 2014 కన్నా 2019 లో ఘోరమైన ఫలితాలు రావొచ్చు.