Thursday, September 23, 2021
HomeEntertainmentCinema Latest‘డీజే’ పాటతో సుమకు సంబంధం ఏంటి?

‘డీజే’ పాటతో సుమకు సంబంధం ఏంటి?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రస్తుతం బుల్లి తెర పరిచయం ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సుమ ఏ స్థాయిలో బుల్లి తెరపై సందడి చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. స్టార్‌ హీరోల ఆడియో వేడుకలు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా సుమ యాంకరింగ్‌ ఉండాల్సిందే. తాజాగా ఈమె అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం ఆడియో వేడుకకు వ్యాఖ్యతగా వ్యవహరించింది. ఈ ఆడియో సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు సుమను సడన్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. సుమతో ఒక పాటను విడుదల చేయించి ఆమెకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చారు.

సాదారణంగా అయితే అతిథులను పిలిచి సుమ వారితో ఆయా చిత్రాల్లోని పాటలను విడుదల చేయించడం జరుగుతుంది. ‘డీజే’లోని ఒక పాటను సుమ స్వయంగా విడుదల చేయడంతో అంతా కూడా ఒకరకమైన ఫీలింగ్‌కు గురయ్యారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల ఆడియో వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించాను అని, అయితే ‘డీజే’ చిత్రంలోని ఈ పాటను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇటీవలే ‘విన్నర్‌’లోని ఒక పాటను పాడిన సుమ తాజాగా ‘డీజే’లోని పాటను విడుదల చేయడం వల్ల ఈ మెగా మూవీలో పార్ట్‌ అయ్యింది.

- Advertisment -
spot_img

Most Popular