Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళుడుకి ఓ నటుడిగా వినోదం పండించినంత కాలం అతనికి జనం బ్రహ్మరధం పట్టారు.తమిళులు అతన్ని ఓ దేవుడిగా పూజించారు.ఇక రజని సినిమాలతోనే తమిళ్ సినిమా మార్కెట్ ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది.ఆయన్ని రాజకీయాల్లోకి రావాలని ఆ తమిళులే దాదాపు పదిపదిహేనేళ్ళుగా డిమాండ్ చేస్తూనే వున్నారు.కానీ ఒక్కసారి ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి అనుకూలంగా మాట్లాడగానే అదే తమిళనాడు ఒక్కసారిగా ఆయన మూలాల్ని శోధించి మరీ కన్నడ,మరాఠీ ముద్ర వేస్తోంది.తమిళుడు కాని వాడికి రాజకీయాల్లో ప్రవేశించే హక్కు లేదని ఇప్పటికే కొన్ని పార్టీలు నానా రచ్చ చేస్తున్నాయి.ఈ వాదనకి సామాన్య తమిళుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.కానీ ఈ వ్యవహారమంతా చూస్తుంటే ఓ విషయం గుర్తొస్తోంది. అదే …అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద మన వాళ్ళ కోపం.
ట్రంప్ విధానాలు జాతి అహంకారాన్ని రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాయని విమర్శించే మనం …ఇక్కడ ఏ విలువలు పాటిస్తున్నాం? రజని కర్ణాటకలో పుట్టి పెరిగిన విషయం,ఆయన తండ్రి ఓ మరాఠీ అన్న విషయం ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తొస్తున్నాయి? సామాన్యులు సైతం రాజకీయం అనగానే విధానాలు గాక కులం,మతం,ప్రాంతం చూస్తున్నంత కాలం ఇలాంటి వాదనలు ముందుకొస్తూనే ఉంటాయి.ఇప్పుడు తమిళనాడులో రజనికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు సమర్ధించే వారు ఇకపై ట్రంప్ గురించి విమర్శలు చేయకుండా ఉంటే మేలు.విలువలు మనిషిమనిషికి, ప్రాంతం ప్రాంతానికి మారవు.కాదంటారా?