కేజ్రీ ఏంటిది ? పక్కా రాజకీయమా ?

0
586

 what kejriwal politics ah.?
నిశబ్ద విప్లవం ఈ మాట విన్నంత తేలిక కాదు ..చూడటం .కానీ కేజ్రీవాల్ కి పట్టం కట్టిన కిందటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిశబ్దవిప్లవానికి నిలువుటద్దం.ఘనాపాటీలైన రెండు జాతీయపార్టీలను ప్రజలు చీపురుతో ఊడ్చేశారు .కేజ్రీవాల్ కి పట్టం కట్టారు.అధికారం దక్కినా కేజ్రీ పోరాటబాట వీడలేదు. విధానపరమైన నిర్ణయాలు,అధికార పరిధి వంటి విషయాల్లో కేంద్రంతో విభేదాలు కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు .ప్రధాని మోడీ నిజం గా కొన్ని ఇబ్బందులు పెట్టి వుండవచ్చునేమో …కానీ ఆప్ ఎమ్మెల్యేల మీదున్న కేసుల విషయం లో పూర్తిగా రాజకీయ కక్షసాధింపు అనలేము.ఆ కేసుల్లో సదరు ఎమ్మెల్యేల భార్యలు పెట్టినవి కూడా వున్నాయి .కొన్ని అక్రమాలకూ సజీవసాక్ష్యాలు కన్పిస్తున్నాయి.

మొదట్లో ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు ఎమ్మెల్యేలపై కేజ్రీ కఠన చర్యలు తీసుకున్నారు.పర్వాలేదనుకున్నాం .ఊడ్చయాల్సన చెత్త ఇంకా చాలా ఉందని తెలిసాక ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ పని పక్కనపెట్టి మోడీ మీద యుద్ధం ప్రకటించార.తప్పులు బయటపడినప్పుడు స్వీయశోధన చేసుకోకుండా ఎదురుదాడి చేసే మామూలు రాజకీయనేతలా కేజ్రీ ప్రవర్తిస్తున్నారు.అందుకు ప్రబల సాక్ష్యం పంజాబ్ ఎన్నికల వ్యూహాలు.అసంతృప్తితో వున్న బీజేపీ నేత సిద్ధూ ని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం చూసాం.

దానికన్నా మహా దారుణం వివాదాస్పద ఎంపీ భగవంత సింగ్ మాన్ కి పంజాబ్ ప్రచార బాధ్యతలు అప్పజెప్పటం.కారణం అందరికీ తెలిసిందే అయన కులం ,మతం ..చేదుగా వున్నా ఇది నిజం…కానీ ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమి చిన్నవి కాదు.ఒకటి ..పార్లమెంట్ భద్ర వీడియోలు తీసి ప్రదర్శించడం, మరోటి అయ్యవారు చుక్కేసి సభకి వస్తే కంపు భరించలేక సాటి ఆప్ఎంపీ చేసిన ఫిర్యాదు ..ఇంతటి తీవ్ర ఆరోపణలున్నా భగవంత్ పై కేజ్రీ నమ్మకం చూసాక ఆయనపై ప్రజలకి సందేహం వస్తే తప్పేముంది .సర్వేలు చెప్తున్నట్టు పంజాబ్ లో కూడా జయకేతనం ఎగరవేస్తే ఆప్ ఇక సాంప్రదాయ రాజకీయ పార్టీల సరసనే చేరిపోతుంది .ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది ?

అందరికి భిన్నం ఈ పార్టీ అనుకున్న ఢిల్లీ ప్రజలను మరో రాజకీయపక్షం కొత్త పేరుతో ..కొత్త పద్ధతిలో మోసం చేసిందంతే అనిపిస్తోంది .ఈ సారి వంతు పంజాబ్ దేనా? చూద్దాం..

Leave a Reply