కొత్తకొత్తగా వాట్సాప్….

0
518

whatsApp-1

మార్కెట్లోని ఇతర యాప్‌ల నుంచి పోటీని తట్టుకునేందుకు ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ నిరంతరం అప్‌‌డేట్ అవుతూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే పలు ఫీచర్లను జత చేసిన సంస్థ కొద్ది రోజుల్లో మరిన్ని ఆసక్తికర ఫీచర్లను జత చేయాలని భావిస్తోంది. అవేంటో తెలుసా?

రీడయల్: వాట్సాప్ ద్వారా వచ్చిన కాల్ మిస్ అయితే ఆ నంబర్‌కు వెంటనే కాల్ చేసేందుకు వీలుగా రీడయల్ ఫీచర్‌ను సంస్థ ప్రవేశపెట్టనుంది. కాల్ తిరస్కరణకు గురైన వెంటనే ఈ ఫీచర్ మీ వాట్సాప్ స్క్రీన్ మీద కనిపించనుంది. తాజా బీటా వెర్షన్ లో కంపెనీ వీటిని యాడ్ చేసింది. అయితే గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ వెర్షన్ యాప్ అందుబాటులో లేదు. ఈ ఫీచర్‌ కోసం ఏపీకేమిర్రర్ వెబ్ సైట్ నుంచి యాప్స్ ఏపీకే ఫైల్‌ను మాన్యువల్ గా డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.కాల్ చేస్తే అవతలి వారు లిఫ్ట్ చేయకపోతే వారికి మీరు చెప్పాల్సిన విషయాన్ని వాయిస్ రూపంలో పంపడం కోసం వాయిస్ మెయిల్ ఫీచర్‌ను సంస్థ తీసుకొచ్చింది. దీని ఏపీకేను కూడా ఏపీకేమిర్రర్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒక వ్యక్తి నుంచి వరుసగా ఐదారు సందేశాలు అందాయనుకోండి. అందులో నుంచి ఒక కన్వర్జేషన్‌కు బదులివ్వడం గతంలో కుదిరేది కాదు. కానీ వాట్సాప్ ఇటీవలే యాడ్ చేసిన కొత్త ఫీచర్ సాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఎలా అంటే మీరు ఏ కన్వర్జేషన్‌కు రిప్లై ఇవ్వాలని భావిస్తున్నారో.. దాన్ని ట్యాప్ చేసి రిప్లై ఇచ్చి సెండ్ చేయండి. అవతలి వారికి మీరు ఏ కన్వర్జేషన్‌కు సమాధానం ఇచ్చారో తేలిగ్గా తెలిసిపోతుంది. ఈ కోటెడ్ మెసేజ్ ఫీచర్‌ను ప్రివ్యూ చూసుకునే వీలు కూడా ఉంది.ఒకే ఫాంట్‌తో చాట్ చేసి విసిగిపోయిన వారికోసం వాట్సాప్ ఇటీవలే నూతన ఫాంట్లను తీసుకొచ్చింది.
వాట్సాప్ నుంచి పంపే మెసేజ్‌లు, వాయిస్ కాల్స్‌ను మూడో వ్యక్తి చూసే వీల్లేకుండా ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాట్సప్ త్వరలోనే తన వినియోగదారుల కోసం మ్యూజిక్ షేరింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందట. ముందుగా ఈ ఫీచర్ ఐఓఎస్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్లో ఉన్న మ్యూజిక్‌ను షేర్ చేసుకోవచ్చు.

సమయంలో ఉపయోగపడేలా మెన్షన్ అనే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురానుంది. గ్రూప్ చాట్‌లో ఓ వ్యక్తిని ప్రత్యేకంగా అలర్ట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.వాట్సాప్ త్వరలోనే తన ఐఓఎస్ వినియోగదారుల కోసం జీఐఎఫ్ సపోర్ట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
పెద్ద సైజులో ఉండే ఎమోజీల కోసం బిగ్ ఎమోజీ అనే ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకురానుంది.గత మే నెలలో అండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్‌తో ఉన్న ఆప్ బీటా వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ తర్వాతి అప్‌డేటెడ్ వెర్షన్‌లో మాత్రం ఈ ఫీచర్ కనిపించలేదు. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి మరి కొద్ది సమయం పట్టే అవకాశం ఉంది.

Leave a Reply