ఇక అఫీషియల్‌గా వాట్సప్‌ వీడియో కాలింగ్‌..

0
618

Posted [relativedate]

whatsapp-video-calling
వాట్సప్‌లో వీడియో కాలింగ్‌ రావడమనేది దాదాపు సంచలనమే సృష్టించిందని చెప్పొచ్చు.. స్మార్ట్‌ఫోన్‌ వాడేవాళ్లకు వీడియో కాలింగ్‌ కొత్త కాకపోవచ్చని కాని.. మన దగ్గరున్న వీడియో కాలింగ్‌ యాప్‌ మనం కాల్‌ చేసే వ్యక్తులకు ఉందా లేదా అనేది తెలుసుకుని చేయాల్సి వచ్చేది.. వాట్సప్‌ విషయంలో అలాంటి బాధలు లేవు.. ఎందుకంటే ఈ యాప్‌లేని స్మార్ట్‌ఫోన్‌ని కూడా ఊహించలేని పరిస్థితి.. అందుకే దీంట్లో వీడియో కాల్‌ రావడం అనేది ప్రత్యేకంగా నిలిచింది. ఇన్నాళ్లు బీటా వర్షన్‌కు మాత్రమే ఉన్న ఈ ఫీచర్‌ ఇకనుంచి అఫీషియల్‌గా రానుంది.. దాంతో అందరకీ ఇది చేరువవనుంది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ నడిచి ప్రతి మొబైల్‌కి ఒకే సారి ఈ కొత్త అప్‌డేట్‌ ఇవ్వనున్నండం విశేషం.. ఒకటి రెండు రోజుల్లోనే ఈ కొత్త అప్‌డేట్‌ అందిరికి అందుతుంది. మీరు వీడియో కాల్‌ చేసుకోవాలంటే కచ్చితంగా అవతలివారు కూడా ఈ వర్షన్లకు అప్‌డేట్‌ అయి ఉంటేనే సాధ్యమవుతుంది. అటువంటి కాంటాక్ట్స్‌కి కాల్‌ క్లిక్‌ చేయగానే వీడియో లేదా వాయిస్‌ కాల్‌ అని అడుగుతుంది. నచ్చినది ఎంచుకోవచ్చు.. ప్రస్తుతం ఉన్న వాట్సప్‌ కాల్‌ లాగ్‌లోనే ఎవరు అప్‌డేట్‌ చేసుకున్నారో చెక్‌ చేయోచ్చు.. ఆయా కాంటాక్టల పక్కన వీడియో, ఆడియో సింబల్స్‌ కనిపిస్తాయి.. కాల్‌ పూర్తయినతరవాత క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకునేందుకు యాప్‌ రేటింగ్‌, ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటుంది..

Leave a Reply